Prabhas Kalki 2898AD

ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతున్న ప్రభాస్ – నాగ్ అశ్విన్ ల సృష్టి “కల్కి 2898 AD” హంగామా ఎక్కడా కనపడడం లేదు, వినపడడం లేదు. దేశ వ్యాప్తంగా రిలీజ్ కావాల్సిన సినిమా ఈ పాటికి ప్రతి సినీ అభిమాని దగ్గర చర్చనీయాంశం అయ్యేలా ఉండాలి, కానీ ఆ పరిస్థితి “కల్కి 2898 AD” సినిమాకు ప్రస్తుతం మాత్రం లేదు.

Also Read – ఏపీలో క్రూజ్ పర్యాటకం త్వరలో..

ధియేటిరికల్ ట్రైలర్ తర్వాత వచ్చిన పాజిటివ్ బజ్ ను కొనసాగించడంలో చిత్ర యూనిట్ ఓ విధంగా విఫలమైందనే చెప్పుకోవాలి. హాలీవుడ్ స్థాయిలో కనపడుతోన్న కంటెంట్ ను చూసి ప్రేక్షకులు థియేటర్లకు ‘క్యూ’ కట్టేస్తారనుకుంటే మాత్రం, నాగ్ అశ్విన్ అంచనాలు పూర్తిగా దారి తప్పుతాయని హెచ్చరించక తప్పదు.

ప్రభాస్ “సలార్” విషయంలో కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇదే రకమైన లో-ప్రొఫైల్ పబ్లిసిటీతో రిలీజ్ చేసారు. దాని పర్యవసానాలు ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు “సలార్ 2” అనే సినిమా అసలు ఉంటుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ‘మౌత్ టాక్’తో ప్రేక్షకులు వచ్చి చూసే సినిమా రేంజ్ “కల్కి 2898 AD”ది కాదని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలుసుకోవాలి.

Also Read – వైసీపీ కి ఆ అర్హత ఉందా.? కానీ జనసేన బాధ్యత..!

నామమాత్రపు పబ్లిసిటీ “కల్కి 2898 AD” ఏ మాత్రం సినిమాకు దోహదం చేయదు. ఏ విధంగా పబ్లిసిటీ చేయాలనే విషయంలో దర్శకుడు రాజమౌళిని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు రిలీజ్ చేస్తోన్న దర్శకనిర్మాతలు తప్పక తెలుసుకోవాలి. “పుష్ప” సమయంలో కూడా జక్కన్న సలహాలే సినిమాను ఆ స్థాయికి తీసుకువెళ్లాయని స్వయంగా సుకుమారే సెలవిచ్చారు.

అలాగే నాడు “బాహుబలి” విషయంలో అయినా, “ఆర్ఆర్ఆర్” రిలీజ్ టైంలో అయినా రాజమౌళి ప్రదర్శించిన పబ్లిసిటీ ఐడియాలు బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు నుండే కనకవర్షం కురిపించాయి. అందుకనే ఇప్పటివరకు ఈ రేంజ్ ను మళ్ళీ ప్రభాస్ సినిమా రిలీజ్ అయినా అందుకోలేకపోయింది.

Also Read – జనసేన ‘చిరు’దరహాసం…!

విషయం ‘వీక్’ అయితే, పబ్లిసిటీ ‘పీక్స్’లో ఉంటుందనేది ఓ ఉవాచ. అలాగని కంటెంట్ ‘వీక్’గా లేకపోతే ప్రచారం ‘పీక్స్’లో చేయకూడదని కాదు. నేషనల్ లెవల్ లో రిలీజ్ కాబోతున్న ‘రేంజ్’ ఏమిటో తెలియజెప్పడానికి అయినా అన్ని ప్రాంతాలకు, అందరి సినీ ప్రేక్షకులకు చేరువ అయ్యేలా ఖచ్చితంగా పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది.




సంవత్సరాల తరబడి షూటింగ్.., వేల కోట్ల ఖర్చు.., వందల మంది రేయింబవళ్లు శ్రమ… వీటన్నింటికి సరైన గుర్తింపు, ప్రేక్షకుల ఆదరణ, కాసుల వర్షం కురవాలంటే… పదుల రోజులలో చేయదగ్గ పబ్లిసిటీని పర్ ఫెక్ట్ గా ముగించాలి. అప్పుడే అనుకున్న టార్గెట్ ను “కల్కి 2898 AD” చిత్ర యూనిట్ అందుకోగలుగుతారు.