
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దోపిడీకి, వివక్షకు గురైందని చెప్పుకోవడం మామూలైపోయింది. కానీ సమైక్య రాష్ట్రాన్ని పాలించిన ఆంధ్రా ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాద్‌నే అభివృద్ధి చేశారు తప్ప ఆంధ్రాలో ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు?
విభజన చట్టంలోనే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను వెనుకబడినవిగా పేర్కొన్నారు కదా?నేటికీ రాయలసీమ నీటి కరువుతో అల్లాడుతూనే ఉందిగా?
Also Read – గులక రాయి తగలడం వల్లనే జగన్‌కి మతిమరుపు?
విశాఖ రాజధాని అయితేనే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయని లేకుంటే ఎప్పటికీ వెనుకబడిపోతాయని వైసీపీ నేతలే వాదించారు కదా?
కనుక సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కంటే ఏపీలో జిల్లాలే ఎక్కువ వివక్షకి గురయ్యాయని చెప్పవచ్చు. ఇందుకు ఉదాహరణగా ప్రకాశం జిల్లాలో తాగు, సాగు నీటి కోసం తలపెట్టి అసంపూర్తిగా నిలిచిపోయిన వెలిగొండ ప్రాజెక్ట్ కళ్ళెదుటే ఉంది.
Also Read – చంద్రబాబు-రేవంత్ సమావేశం వైసీపీ, బీఆర్ఎస్ జీర్ణించుకోగలవా?
కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ కింద నిధులు అందిస్తున్నప్పటికీ జగన్ ప్రభుత్వం దానిని వినియోగించుకొని ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేదు. ఆ కారణంగా నేటికీ జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూనే ఉన్నారు.
ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్‌ని కలిసి జిల్లాలో పరిస్థితి వివరించి రూ. 1,290 కోట్లు నిధులు సాధించుకొచ్చి, నేడు నరసింహాపురంలో శంకుస్థాపన చేశారు. జిల్లాలో అతిపెద్ద తాగునీటి ప్రాజెక్ట్ ఇదే.
Also Read – ట్రంప్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!
ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను తాను స్వయంగా పర్యవేక్షిస్తూ 18-20 నెలల్లో నిర్మించి జిల్లాలో 10 లక్షల మందికి తాగునీరు అందిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అవసరమైతే తాను ప్రధాని మోడీని, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్‌ని కలిసి వేడుకొని నిధులు తెస్తానని చెప్పారు.
నేడు ప్రకాశం జిల్లాలో ఓ తాగునీటి ప్రాజెక్టుకి శంకుస్థాపన జరుగుతుండతాం చాలా సంతోషం. చాలా గొప్ప విషయమే. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ళ తర్వాత నేడు తాగునీటి ప్రాజెక్ట్ శంకుస్థాపన జరుగుతుండటం గమనిస్తే ప్రకాశం జిల్లా ఇన్ని దశాబ్ధాలుగా ఎంత వివక్షకు గురైందో అర్దమవుతుంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని కేంద్రంతో మాట్లాడి నిధులు సాధించారు కనుక శంకుస్థాపన జరిగింది.. లేకుంటే?
సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ హయాంలోనే వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగితే ప్రకాశం జిల్లాకు న్యాయం చేసినవారవుతారు.
జల్ జీవన్ మిషన్ తో ప్రకాశం జిల్లా నీటి కష్టాలకు ముగింపు
మార్కాపురంలో ₹1,290 కోట్లతో త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేయనున్న గౌ|| ఉప ముఖ్యమంత్రి< @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
• ఉమ్మడి ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ సమస్యకు, భూగర్భజలాల సమస్యలు పరిష్కారం అయ్యేలా… pic.twitter.com/9I5H43hxjj
— JanaSena Party (@JanaSenaParty) July 3, 2025