YCP పార్టీని సోషల్ మీడియాలో కొంతమంది Y…CHEAP…PARTY…అని కూడా సంభోదిస్తారు. వారు ఎందుకు అంతలా వైసీపీ ని కించపరిచి మాట్లాడతారు అనేదానికి వైసీపీ నేతల ప్రవర్తనే ముఖ్య కారణం అని నేడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మరోసారి నిరూపించి చూపించారు.
వైసీపీ రాజకీయ ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ స్థాయికి చేరుకున్నాయో.? ఎంతటి స్థాయికి దిగజారిపోయాయో.? ఆ పార్టీ నాయకుల రాజకీయ విమర్శలు చూస్తే యిట్టె అర్ధమవుతాయి.
నాటి కొడాలి నాని నుంచి మొదలుపెడితే నేటి ప్రసన్న కుమార్ రెడ్డి వరకు వైసీపీ నేతల నీచ రాజకీయ చరిత్ర ఏపీ రాజకీయాలను ఎంతలా కలుషితం చేశాయో తెలుస్తుంది. ఇటువంటి నీచ రాజకీయానికి వైసీపీ ఖాతాలో ఎన్నో PHD లు ఉన్నాయి. వాటిలో మచ్చుకకు కొన్ని…
* వైసీపీ PHD -1 “బూతు రాజకీయాలు”: ఇందులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే లు చాలమంది అగ్ర స్థానం కోసం పోటీ పడుతున్నప్పటికీ కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
* వైసీపీ PHD – 2 “అవినీతి రాజకీయాలు”: ఈ PHD పట్టా తో ఇప్పటికే అనేకమంది వైసీపీ నేతలు కటకటాల వెనుక సేద తీరుతున్నారు.
* వైసీపీ PHD – 3 “కూల్చివేతల రాజకీయాలు”: ఈ రాజకీయంలో వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి PHD చేసారు. ఆయన స్థాయితో పోటీ పడగల రాజకీయ నాయకుడు వైసీపీ లోనే కాదు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఏ రాజకీయ పార్టీలోనూ లేరనే చెప్పాలి. అసలు ముఖ్యమంత్రిగా వైస్ జగన్ తన తొలి అడుగు ‘ప్రజా వేదిక’ కూల్చివేతతోనే మొదలుపెట్టారు. ఇక నాటి నుంచి ఐదేళ్ల పాటు ఏపీ భవిష్యత్ ను, ఏపీ ఆర్థిక పరిస్థితిని, ఏపీ రాజధాని అమరావతిని కూల్చివేశారు.
* వైసీపీ PHD – 4 “దాడుల రాజకీయాలు”: ఈ తరహా రాజకీయంలో వైసీపీ అగ్ర నాయకత్వం నుండి వైసీపీ కార్యకర్త వరకు అందరూ PHD పట్టాలు పొందినవారే. అందుకు గత ఐదేళ్ల వైసీపీ పాలన సాక్ష్యంగా నిలుస్తుంది. చంద్రబాబు పై రాళ్ల దాడి నుంచి టీడీపీ కార్యాలయం మీద విధ్వంశం వరకు వైసీపీ దాడుల రాజకీయం అనేక స్థాయిలలో ఉతీర్ణత సాధించి PHD పట్టా అందుకుంది.
* వైసీపీ PHD – 5 “మహిళలను కించపరిచే రాజకీయం”: ఈ రాజకీయంలో ఇప్పటికే PHD లు సాధించిన వైసీపీ నాయకులు అనేకమంది ఉన్నప్పటికీ ఆ సంఖ్య నానాటికి పెరుగుతుంది. నాడు వల్లభనేని వంశీ దగ్గర మొదలైన ఈ PHD పట్టా నేడు ప్రసన్న కుమార్ రెడ్డి వరకు వ్యాపించింది. వైసీపీలో ఈ PHD పొందేందుకు వైస్ జగన్ తల్లి, చెల్లికి సైతం వైసీపీ నాయకులు మినహాయింపు ఇవ్వకపోవడం ఇక్కడ కొసమెరుపు.
ఇక వైసీపీ బెదిరింపు రాజకీయాలలో, గంట, అరగంట వంటి అస్లీల రాజకీయాలలో, ఐ ప్యాక్ భ్రమల రాజకీయాలలో, కోడికత్తి, గుల్లకరాయి వంటి రూపకల్పన రాజకీయాలలో, నారాసుర రక్త చరిత్ర వంటి అసత్య రాజకీయాలలో ఇలా అనేకానేకా అంశాలలో వైసీపీ ఎన్నో PHD పట్టాలను సాధించింది.
ఇన్ని PHD పట్టాలను వెనకేసుకున్న కారణంగానే వైసీపీ 151 నుంచి 11 కి చేరింది. అయినా వైసీపీ నాయకులకు ఇప్పటికి తత్త్వం బోధపడక పోగా ఆ పట్టాలు పొందడానికి పోటీపడీమరీ దిగజారి ప్రవరిస్తున్నారు. ఇందుకు తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన నీచమైన విమర్శలు ఉదాహరణలుగా నిలిచాయి.




