కేసీఆర్‌ అసూయపడేలా ఏపీకి ప్రాజెక్టులు, నిధులు

narendra-modi-chandrababu-naidu-and-pawan-kalyan

దేశంలో ఏదైనా రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంపై వరాల జల్లు కురిపిస్తుంటుంది. ఏపీలో ఇప్పుడు ఏ ఎన్నికలు జరుగడం లేదు. కానీ ఎన్నికలప్పుడు ప్రకటించే వరాల కంటే పదిరెట్లు ఎక్కువే ఏపీకి ఇచ్చింది. ఇంకా ఇవ్వబోతోంది.

ADVERTISEMENT

కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీలలో కొన్నిటిని అమలుచేస్తుంది. కొన్నిటిని చేయకపోవచ్చు. కానీ ఏపీకి అడిగినవి, అడగనివి కూడా అనేకం లభిస్తున్నాయి. ఐదేళ్ళ జగన్‌ పాలనలో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రానికి ఈ ఉపశమనం చాలా అవసరమే.

ఇందుకు సిఎం చంద్రబాబు నాయుడు చొరవ ప్రధాన కారణం కాగా, ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలకంగా నిలవడం మరో కారణం.

రూ.2.08 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు, పరిశ్రమలకు శంకుస్థాపనలు చేసేందుకు ప్రధాని మోడీ బుధవారం సాయంత్రం విశాఖకు రాబోతున్నారు. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో ఈరోజు సాయంత్రం భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ, సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, మంత్రులు పాల్గొనబోతున్నారు… కనుక భారీగా పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాజెక్టులు, వాటికి సమకూరుస్తున్న నిధుల వివరాలు, కేవలం ఏడు నెలల్లో ఏపీలో రూ.15,098 కోట్ల వ్యయంతో జరిగిన అభివృద్ధి పనులు ఇరుగు పొరుగు రాష్ట్రాలు అసూయపడేలా ఉన్నాయి.

ఇంతకాలం జగన్‌ పాలనలో దయనీయ స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రాన్ని చూసి అవహేళనగా, చాలా చులకనగా మాట్లాడిన బిఆర్ఎస్ పార్టీ నేతలకు, ముఖ్యంగా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులకు వీటిని జీర్ణించుకోవడం కష్టమే. కానీ అభివృద్ధిపదంలో పరుగులు తీస్తున్న ఏపీని, ప్రభుత్వాన్ని తప్పు పట్టలేరు కనుక “ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తన రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్లు సాధించుకుంటే నువ్వేమి చేస్తున్నావు రేవంత్ రెడ్డీ?” అంటూ తమ ముఖ్యమంత్రిపై విరుచుకు పడకమానరు.

ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రంలో నేడు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయబోయే ప్రాజెక్టుల వివరాలు క్లుప్తంగా:

1. విశాఖ: రూ.149 కోట్లతో రైల్వే జోన్ ఏర్పాటుకి ప్రధాన కార్యాలయం వగైరా భవన సముదాయాల నిర్మాణం.

2. అనకాపల్లి జిల్లా: పూడిమడకలో రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడితో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్. ఉద్యోగాలు, ఉపాది: 20,000 మందికి.

3. ఉమ్మడి విశాఖ జిల్లాలో: రూ.1,876 కోట్లు వ్యయంతో రెండు వేల ఎకరాలలో బల్క్ డ్రగ్ పార్క్. పెట్టుబడుల అంచనా: రూ.10-14,000 కోట్లు. ఉద్యోగాలు: 28,000 మందికి.

4. తిరుపతి జిల్లా: ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్, ఆటో, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, తదితర పరిశ్రమల కోసం రూ. 2,139 కోట్ల పెట్టుబడితో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ (క్రిస్ సిటీ)కి శంకుస్థాపన. తొలిదశలో పెట్టుబడుల అంచనా: రూ.37,500 కోట్లు. ఉద్యోగాలు, ఉపాధి: సుమారు 4.67 లక్షల మందికి.

5. ఏపీలో వివిద జిల్లాలో: రూ.4,593 కోట్లు వ్యయంతో జాతీయ రహదారి ఎన్‌హెచ్-516తో సహా 2,4, వరుసల రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులు.

6. రైల్వే ప్రాజెక్టులు: గుంటూరు-తెలంగాణలో బీబీ నగర్‌, డోన్-మహబూబ్ నగర్‌, ఏపీలో వివిద ప్రాంతాలలో రైల్వే ప్రాజెక్టులు రూ.6,336 కోట్లు.

అభివృద్ధి పనులు: రూ.15,098 కోట్లు వ్యయంతో ఇప్పటికే నిర్మించిన రోడ్లు, పూర్తయిన రైల్వే లైన్లు, వగైరాలకు నేడు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేస్తారు.

ADVERTISEMENT
Latest Stories