పులివెందుల పులి అంటూ ఇన్నాళ్లుగా డబ్బాలు కొట్టుకున్న వైసీపీ భజన గ్యాంగ్ కు ఆ గ్యాంగ్ లీడర్ జగన్ కు ఈ రోజు ఓటమి తాలూకా అవమానం ఎలా ఉంటుందో సొంత పార్టీ కార్యకర్తలే రుచి చూపించారు.
కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా రాకపోవడంతో అసెంబ్లీ గేటు తాకడానికి కూడా భయపడి తన సొంత నియోజకవర్గమైన పులివెందుల పారిపోయాడు జగన్ అంటూ ఉదయం నుంచి జగన్ పై విరుచుకుపడుతున్నారు కూటమి మద్దతుదారులు.
అయితే జగన్ ఘోర ఓటమితో వైసీపీ పార్టీ కార్యకర్తలకే బీపీ లు వచ్చి జగన్ ఇంటి పై దాడికి యత్నించారు. అధికారంలో ఉన్నన్నాళ్లు కనీసం తమని పట్టించుకున్న దాఖలాలు లేవని, పదవి ఉన్నంత కాలం తాడేపల్లి ప్యాలస్ విడిచి బయటకు రాలేదు కానీ ఇప్పుడు పదవి పోగానే మళ్ళీ గుర్తొచ్చామా అంటూ నినాదాలు చేస్తూ జగన్ ఇంటి అద్దాలను ధ్వంసం చేసారు వైసీపీ కార్యకర్తలు.
జగన్ ప్రభుత్వంలో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద వైసీపీ శ్రేణులు రాళ్ళు, కర్రలు, సుత్తులతో దాడి చేస్తే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ మా పార్టీ కార్యకర్తలకు బీపీ లు వచ్చాయి అవి తగ్గడానికే టీడీపీ కార్యలయాన్ని ధ్వంసం చేసారు అంటూ హింసను సమర్దించారు జగన్. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు.
ఓటమికి ఈవీఎంలు కారణమని ఇన్నాళ్లుగా సాకులు వెతుకున్న జగన్ కు ఇప్పుడు అసలు
కారణం అవగతం అయ్యే ఉంటుంది. వైస్ కుటుంబానికి కంచుకోటలాంటి సొంత నియోజకవర్గంలో, సొంత పార్టీ శ్రేణులే ఒక పార్టీ అధినేత మీద తిరగబడ్డారు అంటే జగన్ పై ప్రజలలోనే కాదు పార్టీలో కూడా ఎంత వ్యతిరేక ఉందో స్పష్టమవుతుంది.
అధికారం అనే కవచంతో ఇన్నాళ్లుగా కాపాడుకుంటున్న పరువును, పార్టీ మీద పట్టును జగన్ ఈనాటితో పోగొట్టుకున్నారు. వైసీపీ పార్టీ నేతలే పులివెందులలో జగన్ పై దాడి చేయడానికి ఇంటి లోపలికి దూసుకు వస్తున్నారంటే మరి జగన్ రెండవ దఫా ఓదార్పు యాత్రకు ఇక్కడితో శుభం కార్డు పడ్డట్టేనా.?
నాకు వయస్సు ఉంది పాదయాత్ర చేయడానికి సత్తువ ఉంది మళ్ళీ ప్రజలలోకి వెళ్లి వైసీపీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వస్తా అంటూ జగన్ చేస్తున్న ప్రకటనలకు వాస్తవ ప్రపంచానికి మధ్య వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందో జగన్ భజన బ్యాచ్ కు ఈపాటికే అర్ధమయ్యే ఉంటుంది.
పోటీ చేసిన రెండు స్థానాలలో ఓడిపోయిన పవన్ కు కానీ, నాలుగు దశబ్దాల అనుభవం ఉన్న టీడీపీ పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైనప్పుడు కానీ టీడీపీ, జనసేన క్యాడర్ నుండి పవన్, బాబులకు ఈ పరిస్థితి ఎదురు కాలేదు.పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ ఇద్దరు నాయకులు ఎల్లప్పుడూ ప్రజలకు చేరువలోనే ఉన్నారు.
కానీ జగన్ కు ఈ తరహా మనస్తత్వం లేదు. కష్టంలో ఉన్నప్పుడు కాపు కాయడానికి తన వాళ్ళను అడ్డుపెట్టుకుని పదవులు,హోదాలు దక్కగానే పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని బూతులు తిట్టే వారిని ప్రోత్సహిస్తారు. గులకరాయి తగిలితేనే నా మీద హత్య ప్రయత్నం జరిగింది అంటూ గగ్గోలు పెట్టిన జగన్ ఇప్పుడు సొంత పార్టీ శ్రేణులే దాడికి ప్రయత్నించడంతో ఎవరికీ చెప్పుకోవాలో..? ఎవరి నుండి ఓదార్పు కోరుకోవాలో మరి.
వైసీపీ కార్యకర్తల నుండి జగన్ కు జరిగిన ఈ ఘోర అవమానం జగన్ రాజకీయ జీవితంలో ఒక చెదరని, చెరపలేని మచ్చగా మిగిలిపోతుంది. చివరిగా చెప్పోచ్చేదేమిటి అంటే దాడులు ఎవరు చేసినా, ఎవరి మీద చేసినా అది ఖండించదగ్గ అంశమే అవుతుంది. మనం అధికారంలో ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్నపుడు విలువలు మాట్లాడితే దాని తాలూకా విధ్వంసం ఇలానే ఉంటుంది.




