పులివెందుల కథ మారేనా.?

Pulivendula election rally with YSR Congress and TDP supporters

ఒక్క ఓటమి టీడీపీ కి ఐదేళ్ల అవమాన్ని రుచి చూపించడం తో పాటుగా గెలుపు మీద కసిని పెంచింది. అలవు కానీ చోట అధికులం కాగలం అన్న ఆశను పుట్టించండి. నాటి కుప్పం మున్సిపాలిటీ ఓటమి నేడు టీడీపీ పులివెందుల పోరుకి ఆజ్యం పోసింది.

మూడు దశాబ్దాల తరువాత పులివెందులలో వైస్ కుటుంబానికి వ్యతిరేకంగా, వారి నియంతృత్వాన్ని ఎదిరించి జడ్పీటీసీ ఎన్నికలకు టీడీపీ సిద్దమయ్యింది. నువ్వా నేనా అన్నంత హోరాహోరీగా పులివెందులలో ప్రచారం పూర్తి చేసిన టీడీపీ 30 ఏళ్ళ తరువాత పసుపు జెండా తో యుద్దానికి సై అంటుంది.

ADVERTISEMENT

ఇన్నాళ్ళుగా ఎమ్మెల్యే, ఎంపీ ల నుంచి స్థానిక సంస్థలలోనూ తమదే హవా కొనసాగిస్తూ అధికారంతో పులివెందులలో ఏకచక్రాధిపత్యం వహించిన వైస్ కుటుబం నేడు తన కుటుంబ పరువు నిలుపుకోవడానికి, తమ పార్టీ ప్రతిష్ట కాపాడుకోవడానికి పోరాడుతుంది.

నాటి కుప్పం గెలుపు నేడు పులివెందుల ఓటమిగా వైసీపీ ని పలకరించబోతుందా అన్న ఆందోళన వైసీపీ అధినేత నుంచి వైసీపీ కార్యకర్త వరకు వెంటాడుతుంది. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా ఇన్నాళ్లు పులివెందులలో వైస్ కుటుంబం ఆధిపత్యం కొనసాగగా,

ఇప్పుడు వైస్ వివేకా హత్య తో వైస్ కుటుంబం మధ్యన చీలిక రావడం, సునీత వైసీపీ కి వ్యతిరేకంగా గళం విప్పడం, షర్మిల జగన్ పై విరుచుకుపడడం, అవినాష్ పై వివేకా హత్య ఆరోపణలు రావడం వైసీపీ కంచుకోటకు బీటలు పడేలా చేస్తున్నాయి.

ఉప్పుకు నిప్పు తోడైనట్టు ఈ కుటుంబ వివాదానికి టీడీపీ పట్టుదల, గెలవాలన్న కసి తోడవడంతో పులివెందులలో వైసీపీ కి చమటలు పడుతున్నాయి. నీవు నేర్పిన విధ్యేగా నీరజాక్షా అన్నట్టుగా కుప్పం మున్సిపాలిటీ పై వైసీపీ వేసిన ప్రణాళికలు నేడు టీడీపీ కి ఆయుధాలుగా మారాయి.

ఇన్నేళ్ల తరువాత పులివెందులలో జరగబోతున్న జడ్పీటీసీ ఎన్నికల కోసం రెండు పార్టీల నేతలు ఒకరి పై ఒకరు విమర్శల కత్తులు దూస్తున్నా, అధికారులు మాత్రం వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. అలాగే ఆ ప్రాంత ప్రజలు మూడు దశాబ్దాల తరువాత తమ ఓటు హక్కును వినియోగించేందుకు సిద్ధమయ్యారు.

ఈ ఉప ఎన్నిక పులివెందుల కథ మార్చబోతుందా.? వైసీపీ కూసాలు కదల్చబోతుందా.? వైస్ కుటుంబాన్ని కాదని పులివెందుల ప్రజలు టీడీపీ కి పట్టం కట్టనున్నారా.? నాటి కుప్పం ఓటమికి టీడీపీ బదులు చెప్పనుందా.? నాడు బాబుకి జరిగిన అవమానానికి టీడీపీ నేతలు నేడు జగన్ కు సమాధానం చెప్పగలరా.? అన్నఅనేక ప్రశ్నలు ఈ ఉపఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి.

అయితే సార్వత్రిక ఎన్నికల ఘోర పరాజయం తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో వైసీపీ కి ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారుతున్నాయి. వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి, టీడీపీ నుంచి లతా రెడ్డి పోటీ చేస్తున్న ఈ ఎన్నికలు 6 గ్రామా పంచాయితీల పరిధిలో జరగనున్నాయి.

అయితే ఇక్కడ పోటీ చేస్తున్నది టీడీపీ, వైసీపీ అభ్యర్థులే అయినప్పటికీ గెలుపు మాత్రం బాబు – జగన్ లదిగా భావిస్తున్నారు ఆయా పార్టీల నేతలు. ఆ కారణంగానే ఈ సారి పులివెందుల వార్ వైసీపీ కి వన్ సైడ్ కాకుండా పోయింది.

ADVERTISEMENT
Latest Stories