పెరిగిన ఉత్కంఠ… పూరీ బ్లడ్ బయటకు..!

Puri Jagannath Caught off Guard in SIT Trail -Nervous Charmy Nextసిట్ అధికారుల ఎదుట విచారణను ఎదుర్కొంటున్న సంచలన దర్శకుడు పూరీ జగన్నాధ్… ‘తాను ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదన్న’ విషయాన్ని స్పష్టంగా చెప్పడంతో, పూరీ బ్లడ్ శాంపిల్స్ ద్వారా నిజాన్ని రాబట్టాలని అధికారులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా కెల్విన్ తో పరిచయం విషయంలో పూరీ చెప్పిన జవాబులకు, సిట్ అధికారులు భావిస్తున్న అంశాలను తారతమ్యం ఉండడంతో… పూరీ చెప్పేవి నిజాలో, కాదో అని తేల్చడానికి ఉస్మానియా వైద్యులను రంగంలోకి దించుతున్నారు.

పూరీ జగన్నాధ్ ను విచారణ చేస్తోన్న హైద‌రాబాద్‌లోని ఎక్సైజ్ శాఖ కార్యాల‌యానికి ఉస్మానియా ఆసుప‌త్రి నుంచి నార్కోటిక్ నిపుణులు చేరుకోవ‌డంతో మరింత ఉత్కంఠ నెల‌కొంది. పూరీ ర‌క్త‌ న‌మూనాల‌ను సేకరించేందుకు బ్లడ్ శాంపిల్ కిట్ ను మెడికల్ సర్జన్ లోపలికి తీసుకువెళ్ళారు. పూరీ డ్ర‌గ్స్ తీసుకున్నారా? లేదా? అన్న విష‌యాన్ని వైద్యప‌రంగా కూడా నిర్ధారించి అధికారులు నివేదిక త‌యారు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ టెస్ట్ లో నిజంగా పూరీ డ్రగ్స్ తీసుకున్నారన్న విషయం బయట పడుతుందా? అంటే…

ADVERTISEMENT

గత రెండు, మూడు రోజులలో డ్రగ్స్ తీసుకుంటే ఖచ్చితంగా బయట పడుతుందని, అదే గనుక ఓ రెండు, మూడు నెలలు గడిస్తే మాత్రం బయట పడడం అసాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పూరీ బ్లడ్ బయటకు వచ్చినా, సీత అధికారులకు ప్రయోజనం ఉంటుందా? అన్నది త్వరలో తేలనుంది. వారు అబద్దం చెప్తున్నారా? నిజం చెప్తున్నారా? అన్నది తెలుసుకోవాలంటే మాత్రం కోర్టు అనుమతితో నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే సరిపోతుందని మానసిన వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories