జగన్ విధానం అలా…బాబు పద్దతి ఇలా..!

Raghu Rama Krishna Raju Chandrababu Naidu Jagan

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రత్యర్థి పార్టీ నేతలమీద దాడికి తెగబడిన వారికీ, విపక్ష సభ్యుల ను, వారి కుటుంబాలను బూతులు తిడుతూ మానసిక క్షోభ కు గురి చేసిన నేతలకు అప్పటి ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి పదవులిచ్చి మరి సత్కరించి తన విధానాన్ని సమాజం ముందు ఆవిష్కరించారు.

ADVERTISEMENT

అయితే ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు గత పాలకుల అన్యాయాన్ని ఎదిరించి నిలబడిన వారికీ, వైసీపీ ప్రభుత్వ విధానాలకు బలైన వారికీ పదవులు లిచ్చి గౌరవిస్తూ తన పద్దతి ఇది అని సమాజానికి చాటిచెపుతున్నారు.

ఇందులో ముఖ్యంగా రఘురామా రాజు విషయాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్వపక్షంలోనే విపక్షముగా తయారైన రఘురామా రాజు పట్ల జగన్ అనుసరించిన తీరు ఇప్పటికి చర్చనీయాంశంగానే కొనసాగుతుంది. గత ఐదేళ్లు తన సొంత నియోజకవర్గానికి సైతం రాలేని ఏకైక ఎంపీ గా RRR చరిత్ర సృష్టించారంటూ బాబూ వ్యాఖ్యానించారు అంటేనే పరిస్థితి ఎంత తీవ్రతగా ఉందో స్పష్టమవుతుంది.

వైసీపీ ప్రభుత్వంతో పోరాడడానికి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన రఘురామా కృష్ణ రాజుకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి ఆయన తెగింపుకి, ఆయన త్యాగానికి ఒక గౌరవాన్ని అందించారు బాబు. గత ముఖ్యమంత్రి జగన్ అప్పటి ప్రతిపక్ష నేత ఇంటి మీదకు దాడికి వెళ్లిన జోగి రమేష్ కు మంత్రి పదవి ఇచ్చి దాడులను ప్రోత్సహిస్తే, వైసీపీ దాడులను ఎదుర్కున్న RRR కు పదవి కట్టబెట్టి ధైర్యానికి అండగా నిలిచారు బాబు.

జగన్ సోషల్ మీడియాలో బూతు పోస్టులు పెట్టిన వారికీ ప్రభుత్వ సొమ్ము ఇచ్చి మరి ఉపాధి కల్పిస్తే, బాబు బూతు పోస్టులు పెట్టే వారిని అదుపు చేయడానికి చట్టాలు రూపొందించాలని భావిస్తున్నారు. అనంతబాబు వంటి హత్యా నేరస్తులకు జగన్ అండగా ఉంటే, పోలింగ్ రోజు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మాచర్ల టీడీపీ బూత్ ఏజెంట్ గా పోరాడిన చెరెడ్డి మంజుల కి నామినేట్ పదవి ఇచ్చి నేరస్తులను ఎదిరించేవారికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని రుజువు చేసారు.

పదవి కోసం సంస్కారాన్ని, మహిళా అనే కనీస సృహను మరిచిపోయే రోజా లాంటి వారికి జగన్ అండగా ఉంటే, పదవి చేతిలో ఉండి కూడా చట్టబద్ధంగా వ్యవహరించాలి అని తన సొంతవారితో కూడా మాటలు పడ్డ అనిత కు బాబు ఆసరాగా నిలిచారు. కొడాలి నాని లాంటి సామజిక ఉన్మాదులను జగన్ ప్రోత్సహిస్తే కొల్లు రవీంద్ర వంటి బీసీ నేతకు కీలక మంత్రి పదవి కట్టబెట్టి సామజిక న్యాయం చేసారు బాబు.

సొంత చెల్లి, తల్లిని అవమానించినవారికి అండగా ఉంటూ వారి పైశాచికత్వానికి మద్దతు పలుకుతూ నేనున్నాను అంటూ వైసీపీ సోషల్ మీడియా సైకోలకు జగన్ మద్దతు తెలుపుతుంటే, ఎవరింట్లో మహిళను అగౌరవపరిచిన ఉపేక్షించేది లేదని, చట్ట పరంగా అటువంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవడానికి వ్యవస్థలను బలపర్చడానికి నేనున్నాను అంటూ బాబు భరోసా ఇస్తున్నారు. దీనితో జగన్ పద్దతి అలా ఉంటే బాబు విధానం ఇలా ఉందా అంటూ రెంటిని బేరీజు వేసుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories