నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్, హుండీ ఎమ్మెల్యే రఘురామా కృష్ణ రాజు మధ్య ఆసక్తికర దృశ్యాలు మీడియా కంటిని ఆకర్షించాయి.
గత ఐదేళ్లుగా వైస్ జగన్ మీద రచ్చబండ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో రోజు రచ్చ చేసే RRR జగన్ దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి కాసేపు ముచ్చటించారు. అయితే రఘురామా జగన్ తో ఏ విషయాల గురించి ప్రస్తావించి ఉంటారు అనే చర్చ ఊపందుకుంది.
గత ప్రభుత్వంలో జగన్ సహకారంతో తన పై హత్యాప్రయత్నం జరిగిందంటూ జగన్ మీద కేసులు పెట్టిన రఘురామా ఇప్పుడు జగన్ తో ముచ్చడించడంతో వీరిద్దరి సంభాషణ మీదా ప్రజలలో ఆసక్తి మొదలయ్యింది.
జగన్ ఒక ప్రజాప్రతినిధిగా ప్రతి రోజు అసెంబ్లీకి రావాలని తానూ సూచించానని, ఇది ఒక మర్యాద పూర్వక కలయిక మాత్రమేనని రఘురామా దీనిపై స్పందించారు. అయితే ఇన్నాళ్ళుగా జగన్ ను సోషల్ మీడియా వేదికగా విమర్శించిన రఘురామా ఇప్పుడు అసెంబ్లీ వేదికగా జగన్ ను జగన్ ముందు ర్యాగింగ్ చేయడానికి పథకాలు రచిస్తున్నారా?
అందులో భాగంగానే జగన్ ను ప్రతిరోజూ అసెంబ్లీకి రావాలని రఘురామా జగన్ కు సలహాలిచ్చారా? అందునా తానూ జగన్ పక్క సీట్లో కూర్చోవాలని అనుకున్నట్లు తన అభీష్టాన్ని మీడియా ముందు ప్రకటించి అటు వైసీపీ ను ఇటు కూటమి నేతలను ఇంకాస్త ఆశ్చర్యపరిచారు.
అయితే తానూ ఏ పార్టీలో సీటు దక్కించుకుని గెలుపొందుతారో ఆ తరువాత ఆ పార్టీకే రెబల్ నాయకుడిగా మారిపోవడం రఘురామా కృష్ణరాజు రాజకీయ సంప్రదాయంగా వస్తుంది. ఈ నేపథ్యంలో రఘురామా జగన్ ను కలవడం కూటమి నేతలను ఒక విడత కంగారు పెట్టించే అంశమే.
ఐదేళ్లుగా వైసీపీ మీద పెంచుకున్న పగకు ప్రతీకారం తీర్చుకోవడానికి రఘురామా జగన్ ను కలిసేందుకు ముందడుగు వేసారా? లేక RRR కు కొత్తగా జగన్ మీద ప్రేమ పుట్టిందా? అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.




