సవాల్ విసిరి… తోక ముడిచి… ఇదేందయ్యా?

Raghu-Rama-Krishnam-Raju- Bhimavaram-visitవైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు పోలీసుల వేధింపులకు భయపడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ఈరోజు ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి వస్తాను… ప్రధాని నరేంద్రమోడీతో కలిసి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలలో పాల్గొంటానని జగన్ ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టుకొంటుందో పెట్టుకోవచ్చునని నాలుగు రోజుల క్రితమే సవాల్ విసిరారు.

ADVERTISEMENT

రఘురామకృష్ణ రాజు ఆదివారం రాత్రి హైదరాబాద్‌, లింగంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి తన అనుచరులతో కలిసి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. కానీ అక్కడి నుంచే ఏపీ పోలీసులు తన రహస్యంగా వెంబడిస్తున్నట్లు పసిగట్టి బేగంపేట రైల్వేస్టేషన్‌లో దిగిపోయారు. తనపై, తన అనుచరులపై కేసులు ఉండటంతో ఏపీలో అడుగుపెట్టగానే పోలీసులు తమను అరెస్ట్ చేస్తారనే భయంతో రఘురామకృష్ణరాజు అర్దాంతరంగా తన భీమవరం పర్యటనను విరమించుకొని హైదరాబాద్‌లోనే ఉండిపోయారు.

ఎంపీ హోదాలో ఉన్న రఘురామకృష్ణ రాజు తన రాష్ట్రంలో, తన నియోజకవర్గం అడుగుపెట్టడానికి భయపడుతున్నందుకు ఆయనను నిందించాలా లేదా ఆయనకు అటువంటి పరిస్థితి కల్పించినందుకు జగన్ ప్రభుత్వాన్ని నిందించాలా?అనే ప్రశ్నకు వారే సమాధానం చెప్పుకోవాలసి ఉంటుంది.

కానీ ఎంపీ రఘురామ ఇటువంటి దుస్థితి ఎదుర్కొంటుంటే, కేంద్ర హోంశాఖ, లోక్‌సభ స్పీకర్ ఎందుకు స్పందించడం లేదు?గత ఏడాది తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఓ పోలీస్ అధికారి ఆయనతో దురుసుగా ప్రవర్తించినందుకే తెలంగాణ ప్రభుత్వంలో సంబందిత ఉన్నతాధికారులందరికీ నోటీసులు పంపి సంజాయిషీ కోరిన కేంద్ర హోంశాఖ, లోక్‌సభ స్పీకర్ ఏపీ పోలీసులు విచారణ పేరుతో రఘురామకృష్ణ రాజును చిత్రహింసలు పెట్టినా ఎందుకు స్పందించ లేదు?అంటే బహుశః కొన్నిసార్లు వైసీపీ ఎంపీల మద్దతు అవసరమనే కావచ్చు. రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధిని గెలిపించుకోవడానికి మోడీ ప్రభుత్వం వైసీపీ తీసుకొంటుండటమే ఇందుకు తాజా నిదర్శనం. కానీ ఓ ఎంపీ తన రాష్ట్రంలో, తన నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరగలేకపోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్ధం ఏముంటుంది?

ADVERTISEMENT
Latest Stories