కాంగ్రెస్ పుణ్యమా అని ఒకప్పుడు రాష్ట్రానికి ఉన్న శక్తి ఇప్పుడు లేదు. ఒకప్పుడు 42 ఎంపీలు ఉన్న రాష్ట్రమని కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు కొంచెం బెరుకు ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కేవలం 25 మంది ఎంపీలు. ఏ పార్టీ అధికారంలో ఉన్న వీలైనన్ని ఎక్కువ ఎంపీలు తెచ్చుకోకపోతే కష్టం.
ఈ తరుణంలో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలు కీలకంగా మారాయి. అయితే ఆంధ్రప్రదేశ్ నుండి ఒక ఎంపీ లేని కాంగ్రెస్ కు ఇవేమి పట్టడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాలంటే తెదేపా, వైకాపా రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూచించారు.
అది ఏరకంగా రాష్ట్రానికి మేలు చేస్తుందో తెలీదు మరి. బీజేపీ వారు అభ్యర్థులను నిలిపి ఏకగ్రీవంగా గెలిపించుకుంటారు. వాళ్లకు ఉన్న నాలుగు ఎమ్మెల్యేలతోనే. ఈ మాత్రం చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు రఘువీరా? అవునులే వాళ్ళకి ఎలానూ ఈ ఎన్నికలు గెలవడాలు పట్టవు. వాళ్లకు పోయేది ఏముంది? ఎన్నైనా చెప్తాడు!



