పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడం చేతకాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండు చేశారు. “14 శాతం తక్కువకు టెండరు కేటాయించడం తప్పెలా అవుతుంది. నిర్వాసితులకు రూ.34 వేల కోట్ల పరిహారం చెల్లించాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అదీ తప్పేనా?” అని రఘువీరా ప్రశ్నించారు.
34వేల కోట్ల పరిహారం చెల్లించాలని అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయిస్తే పోలవరం వ్యయం చంద్రబాబు పెంచినట్టు కాంగ్రెస్ చేస్తున్న విమర్శల మాట ఏమిటి? 14 శాతం తక్కువకు టెండర్ వేస్తే సరికాదు. ప్రాజెక్ట్ పూర్తి చేసే సామర్ద్యం అసలు ఉండాలి కదా ఆ కాంట్రాక్టర్ కు! ఇప్పుడు అదే కదా సమస్య!
ప్రభుత్వం తీరుకు నిరసనగా పోలవరం ప్రాజెక్టు వద్ద నవంబరు 19 తరువాత దీక్షలు నిర్వహిస్తాం’’ అని రఘువీరా వెల్లడించారు. ఇదంతా సరే చంద్రబాబు దిగిపోతాడు.. మీకు ఎక్కే సీన్ ఉందా? అని కాంగ్రెస్ నాయకులని ప్రశ్నిస్తే రఘువీరా దగ్గర సమాధానం ఉందా అని తెదేపా వాళ్ళు వెక్కిరిస్తున్నారు.


