రాహుల్ పై ప్రసంసలు..కాంగ్రెస్ కు చావుదెబ్బే..!

Rahul Gandhi praised by Pakistan creating political controversy in India

ఎవరైనా రాజకీయ నాయకుడిని ప్రత్యర్థి పార్టీ నేతలు ప్రసంసించినట్లయితే అది వారి రాజకీయ ఎదుగుదలకు సాయపడుతుంది. అదే ప్రత్యర్థి దేశం పొగిడితే అదే వారి రాజకీయ పతనానికి నాంది అవుతుంది.

ఇప్పుడు కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ విషయంలో ఇటువంటి అపద్రవమే ఎదురయ్యింది. భారత్ తో నిత్యం కయ్యానికి కాలుదుస్తూ ఎప్పుడు భారత్ చేతిలో చావుదెబ్బ తినే పాకిస్తాన్ ఇప్పుడు రాహుల్ గాంధీ పై ప్రశంసలు చేసింది.

ADVERTISEMENT

ఆసియా కప్పులో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన ఇండియా – పాక్ క్రికెట్ మ్యాచ్ లో ని కొన్ని అంశాలను పాక్ క్రికెట్ బోర్డు వివాదంగా మారుస్తుంది. ఇండియా – పాక్ మ్యాచ్ ఆరంభ సమయంలో టాస్ వేసినప్పుడు, మ్యాచ్ ముగింపు సందర్భంగా ఇండియా జయకేతనం ఎగరేసినప్పుడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పాక్ కెప్టెన్ కి కానీ పాక్ టీం కి కానీ షాక్ హ్యాండ్ ఇవ్వలేదంటూ పాక్ జట్టు నానా యాగీ చేస్తుంది.

అలాగే ఈ అంశం క్రీడా స్ఫూర్తికి విఘాతం అంటూ పాక్ ఐసీసీ కి ఫిర్యాదు చేస్తూ, ఈ వివాదంలోకి మ్యాచ్ ఎంపైర్ ని కూడా లాక్కొచ్చింది. అది చాల్లేదంటూ తమ ఫిర్యాదు మేరకు వారికి పనిషమెంట్ ఇవ్వాలని లేకుంటే ఆసియా కప్పు సిరీస్ నుంచి పాక్ వైతొలుగుతుంది అంటూ బెదిరింపులకు దిగింది.

అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో పాక్ బెదిరింపులకు, పాక్ ఫిర్యాదులకు ఐసీసీ తలవకక్కపోవడంతో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది రంగంలోకి దిగి ఈ వివాదానికి రాజకీయం చేస్తున్నారు.

భారత ప్రభుత్వం డర్టీ పాలిటిక్స్ చేస్తుందని, హిందూ – ముస్లిం కార్డు వాడుకుంటూ రాజకీయ లబ్ది పొందుతుందని, ఎప్పుడు మత రాజకీయాలను ప్రోత్సహిస్తూ రాజకీయ చేస్తుందంటూ భారత్ ప్రభుత్వం పై తన అక్కసు వెళ్లగక్కారు.

ఇక ఇక్కడి తో ఆగకుండా అటు కాంగ్రెస్ నేత రాహుల్ పై ప్రశంసలు కురిపించారు. రాహుల్ ఇటువంటి రాజకీయాలకు దూరంగా ఉంటారని, ఆయనది పాజిటివ్ మైండ్ సెట్ అని, నిరంతరం ప్రజలతో టచ్ లో ఉంటారని, ఎప్పుడు వాస్తవాలే మాట్లాడతారని, న్యాయం కోసం పోరాడతారంటూ రాహుల్ ను పొగడ్తలతో ముంచెత్తారు.

అయితే ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ పాక్ కు అనుకూలమైన రాజకీయాలు చేస్తుందని, రాహుల్ అందుకు తగ్గట్టుగా భారత్ లో పాకిస్తాన్ కు మద్దతుగా నిలుస్తారు అంటూ కాంగ్రెస్ ను ముఖ్యంగా రాహుల్ ను టార్గెట్ చేస్తుంది.

బీజేపీ విమర్శలకు తగ్గట్టే రాహుల్ కూడా పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై సైతం విమర్శలు చేసారు. దీనితో రాహుల్ పై ఇటు బీజేపీ విమర్శలకు తగ్గట్టే అటు పాకిస్తాన్ ప్రసంశలు దక్కడం కాంగ్రెస్ కు రాజకీయం గా ఎదురు దెబ్బే అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories