టీవీ నటి, బాలికావధు సీరియల్ ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. వ్యభిచారం చేయాలంటూ ప్రత్యూషపై ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఒత్తిడి చేశాడని తాజాగా హల్చల్ చేస్తోన్న సమాచారం. చివరిసారిగా వారిద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్న సంభాషణలను ‘ముంబై మిర్రర్’ వెల్లడించింది. ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు ఈ సంభాషణ జరిగినట్టు పేర్కొంది. మూడు నిముషాల పాటు సాగిన సంభాషణ…
ప్రత్యూష – “నటించడానికి, పని చేయడానికి నేను ముంబైకి వచ్చా. నా శరీరాన్ని అమ్ముకోవడానికి రాలేదు. కానీ, నన్ను ఈ రోజు ఎక్కడ ఉంచావ్? నువ్వు స్వార్థపరుడివి. నా పేరంతా పాడు చేశావ్. నా గురించి, నా తల్లిదండ్రుల గురించి జనాలంతా చెడుగా మాట్లాడుకుంటున్నారు. నేనెంత కుమిలిపోతున్నానో నీకు అర్థం కావడం లేదు” అని తన ఆవేదన అంతా వెలిబుచ్చినట్లు తెలుస్తోంది.
ప్రత్యూష తరపు న్యాయవాది నీరజ్ గుప్తా మాట్లాడుతూ, వ్యభిచారం చేయాలంటూ ప్రత్యూషపై రాహుల్ ఒత్తిడి తెచ్చాడని, రాహుల్ తో మాట్లాడిన చివరి కాల్ లో వ్యభిచారం అనే పదాన్ని ప్రత్యూష వాడిందని అన్నారు. మరోవైపు… రాహుల్ గతంలో తన వాదనను తానూ వినిపిస్తూ… ప్రత్యూష తల్లితండ్రులపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాహుల్ బెయిల్ పై బయట ఉండగా, ఏప్రిల్ 1న అంధేరిలోని అపార్ట్ మెంట్ లో ప్రత్యూష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.



