
పార్టీ విధేయులుగా పనిచేసిన నాయకులే ఒక్కో సందర్భంలో ఆ పార్టీకి విరోధులుగా మారిపోతుంటారు. మరి ముఖ్యంగా పదవుల పంపకాలు, రాజకీయ అవసరాల నేపథ్యంలో ఈ విధేయులే పార్టీకి రెబల్ గా మారి పార్టీ అధిష్టానం పై విమర్శలు ఎక్కుపెట్టిన సందర్భాలు కోకొల్లలనే చెప్పాలి.
ఇందుకు ఈ పార్టీ ఆ పార్టీ అంటూ భేదభావాలేమి ఉండవు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా సొంత పార్టీ నాయకుల బాధితులనే చెప్పుకోవాలి. తాజాగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో జాతీయ పార్టీ అయిన బీజేపీ అధిష్టానం కూడా తమ సొంత పార్టీ నాయకుల చేత విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
Also Read – ఉల్ఫా బ్యాచ్ అట… జగన్ హర్ట్ అవరూ?
హైద్రాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గా ఆ పార్టీ అధిష్టానం డా.ఎన్ గౌతమ్ రావు పేరును ఖరారు చేసినట్టు ప్రకటించారు. సొరియాలజి లో డాక్టరేట్ పొందిన గౌతమ్ విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ గా పని చేస్తున్నారు. ఆయన గతంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ గాను పార్టీకి సేవలందించారు.
అయితే ఎమ్మెల్సీ పదవి గౌతమ్ కి ఇవ్వడం పై బీజేపీ వీర విధేయుడిగా పేరొందిన రాజాసింగ్ పార్టీ అధిష్టానం పై మండిపడ్డారు. హైద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అధిష్టానానికి అభ్యర్థులే కరువయ్యారా.? పార్టీ కోసం శ్రమించే ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు పార్టీ పెద్దలకు పట్టరా.? పార్టీ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి జెండా మోస్తున్న సీనియర్ నాయకులను అధిష్టానం గుర్తించదా.? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాజా సింగ్.
Also Read – గెలిస్తే ఇక్కడి నుండి సమరం, లేదా తిరుగు ప్రయాణం..!
గతంలో కూడా రాజాసింగ్ వ్యవహార శైలి బీజేపీ రాష్ట్ర, జాతీయ స్థాయి అధిష్టానానికి అనేక తలనొప్పులు తెచ్చిపెట్టాయి. దూకుడుగా వ్యవహరించడం, ముక్కుసూటిగా మాట్లాడడం, వివాదాస్పద అంశాలను భుజాన వేసుకోవడం, మత రాజకీయాలు చేయడం ఆయన రాజకీయ సిద్ధాంతం అన్నట్టుగా తెలంగాణ బీజేపీ కి రెబల్ అభ్యర్థిగా మారిపోతున్నారు రాజా సింగ్.
గతంలోను ఒక కేసులో జైలుకెళ్ళిచ్చిన రాజాసింగ్ ఆ సందర్భంలో కూడా పార్టీ కానీ, పార్టీలోని ముఖ్య నేతలు కానీ తనను పట్టించుకోలేదని, అసలు పార్టీలో కొంతమంది నాయకుల చేష్టలతోనే తానూ జైలు కెళ్లే పరిస్థితి వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. మరి అధిష్టానం మీద ఈ రకమైన తిరుబాటు బావుటా ఎగరేస్తున్న ఈ రాజాసింగ్ ను బీజేపీ పెద్దలు కట్టడి చేయలేకపోతున్నారా.? లేక ఆయన వ్యవహారశైలిని పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదా.?
Also Read – వాఘా మూసేసి సరిహద్దులు తెరుస్తామంటున్న పాక్ పాలకులు!