20 నిముషాల్లో… “ఆర్ఆర్ఆర్” ట్రాన్స్ లోకి…!

Rajamouli in 20 minutes audience will go into  RRR tranceసినీ ప్రేక్షకులంతా ఎదురు చూస్తోన్న “ఆర్ఆర్ఆర్” విడుదలకు కౌంట్ డౌన్ షురూ అయ్యింది. మరో 48 గంటల్లో “ఆర్ఆర్ఆర్” హంగామా పతాకస్థాయిలో ఉండనుంది. దీంతో అభిమానులు మొదలుకుని ట్రేడ్ పండితుల వరకు ఈ సినిమా ఫస్ట్ డే సృష్టించబోయే సంచలన లెక్కలను వెతికే పనిలో ఉన్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించి ఇప్పటికే పదుల సంఖ్యలో రాజమౌళి – ఎన్టీఆర్ – రామ్ చరణ్ తేజలు పాల్గొన్న ఇంటర్వ్యూలు బుల్లితెరపై సందడి చేస్తున్నాయి. అయినప్పటికీ రోజుకో కొత్త ఇంటర్వ్యూ వచ్చి ప్రేక్షకులను ఉత్సాహపరుస్తోంది. ఆ క్రమంలోనే ఓ లేటెస్ట్ ఇంటర్వ్యూలో జక్కన్న చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ADVERTISEMENT

“ఇద్దరి హీరోల పరిచయ సన్నివేశాలు ముగియగానే, వచ్చే ఎమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకులు లీనమైపోతారని, హీరోల ఎమోషన్స్ ను తమ ఎమోషన్స్ గా ప్రేక్షకులు ఫీల్ అవుతారని, ఇదంతా సినిమా ప్రారంభమై 20 నిముషాలలో జరుగుతుందని, ఇక సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమా చూడాలనే అనుభూతికి ప్రేక్షకుడు వస్తాడని” రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఇదంతా తాను ఎంతో బలంగా నమ్ముతున్నానని, సినిమా అంతా ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉంటుందని చెప్పిన జక్కన్న మాటలు ప్రస్తుతానికి సినిమా చూడాలన్న ఉత్సాహాన్ని ఆడియన్స్ కు పెంచుతున్నాయి. అయితే తన సహజశైలికి విరుద్ధంగా రాజమౌళి స్టేట్మెంట్స్ ఇస్తుండడం విశేషం. గతంలో ఎన్నడూ తన సినిమాల గురించి ఈ స్థాయిలో విశ్వాసాన్ని జక్కన్న వ్యక్తపరచలేదు.

అలాగే ‘సినిమా అయిపోయాక మళ్ళీ చూడాలనే అనుభూతికి ప్రేక్షకుడు వస్తాడు, ఇది నా నమ్మకం’ అనే ప్రకటనలు జక్కన్న ఎప్పుడూ ఇవ్వలేదు. బహుశా “ఆర్ఆర్ఆర్” కధపై ఉన్న నమ్మకమో ఏమో గానీ, ప్రేక్షకుల అంచనాలను మాత్రం పెంచేస్తున్నారు. జక్కన్న చెప్పిన విధంగా ప్రేక్షకులు ఫీల్ అయితే పర్లేదు గానీ, ఏ మాత్రం తేడా వచ్చినా సోషల్ మీడియా లెక్క మరింత తేడాగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ADVERTISEMENT
Latest Stories