చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటికే లోకేష్ కి ఫోన్ చేసి తన మద్దతును తెలియచేసిన రజనీకాంత్ స్వయంగా వచ్చి చంద్రబాబు కి తన కుటుంబానికి సంఘీభావం తెలపడం టీడీపీ శ్రేణులలో రజనీ పట్ల గౌరవం పెరిగింది.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో చంద్రబాబు విజనరీని మెచ్చుకున్నందుకే వైసీపీ బూతుల నాయకుడిగా ఖ్యాతి పొందిన కొడాలి నాని, అసభ్యకర విమర్శలతో ఎప్పుడు ఫేమ్ లో ఉండే రోజా..,రజనీని ఎంత అగౌరవ పరిచారో ఇంకా రజని అభిమానులు మరిచిపోలేదు. ఇంతటి విమర్శలను ఎదుర్కున్న వాటి పై ప్రతిస్పందన కూడా తెలపలేదు రజని.
Also Read – కొండ తవ్వినా ఎలుకలు దొరకలేదే!
అరిచే కుక్కలు ప్రతి ప్రాంతంలో ఉంటాయి… వాటిని చూసి చూడనట్టు మన పని మనము చేసుకుంటూ పోవాలి.. అర్థమైందా రాజా! అంటూ రజని సినీమా వేదిక మీద చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను ఉద్దేశించి చేసినవే అంటూ సోషల్ మీడియాలో అప్పట్లో ట్రెండింగ్లో నిలిచాయి. అటువంటి నీచ రాజకీయాలు చేసే నేతలు ఈ రాష్ట్రములో ఉన్నప్పటికీ బాబు పై తనకున్న నమ్మకాన్ని ప్రజల ముందుంచడానికి రజని వేస్తున్న ముందడుగు హర్షించదగింది.
చంద్రబాబు అధికారంలో ఉన్న 14 ఏళ్లలో బాబు కి తనకు మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం నుండి కానీ బాబు నుంచి గాని ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించలేదు రజనీకాంత్. కానీ తన స్నేహితుడు ఆపదలో ఉంటే మాత్రం తనకు అండగా నిలబడడానికి ఇటువంటి ముష్కరమూకలా విమర్శలు ఎదుర్కోవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావడానికి సిద్ధపడ్డారు. చంద్రబాబు ని అతనికి కుటుంబాన్ని కలిసి వారికి ధైర్యం చేప్పి తన మద్దతుని తెలియచేయనున్నారు.
Also Read – దొరన్నారు…దాక్కుంటున్నారే..?
తెలుగు పరిశ్రమ నుండి కనీస మద్దతు కరువైన తరుణంలో పక్క రాష్ట్రము నుండి వచ్చి మరి తన సంఘీభావాన్ని తెలుపుతున్న రజనీకాంత్ ను చూసి ఇది కదా అసలు హీరో ఇజం అంటే అంటూ తలైవా అభిమానులు తెలుగు సినీ అగ్రహీరోలు ఉద్దేశించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.