‘ధృవ’ చూసిన ‘చెర్రీ’ అభిమానులకు యాక్సిడెంట్!

Ram Charan Dhruva Fans AcciDentతమ అభిమాన హీరో రామ్ చరణ్ తాజా చిత్రం ‘ధృవ’ సినిమా చూసి వస్తూ… రోడ్డు ప్రమాదానికి గురయ్యారు అభిమానులు. ఈ ఘటనలో ఇద్దరు అభిమానులు దుర్మరణం పాలవ్వగా, మరో 12 మంది గాయాల పాలయ్యారు. గద్వాల జిల్లా, వావిలాలకు చెందిన రామ్ చరణ్ అభిమానులు శుక్రవారం విడుదలైన “ధృవ” సినిమా చూడ్డానికి సెకండ్ షోకు వెళ్లారు.

సినిమా చూసిన తర్వాత ఆటోలో వారు తిరుగుపయనం కాగా, పందెపురం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న లారీ వారి ఆటోను ఢీ కొట్టింది. దీంతో, రాజు, సతీష్ అనే యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. తీవ్రంగా గాయపడ్డ మరో 12 మందిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories