ఏపీలో రిలయన్స్ ఎనర్జీ… పెట్టుబడి తెలుసా?

Nara Lokesh

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికీ సరిగ్గా 5 నెలలు. మొదటి ఆరు నెలలు పూల బోకెలు, అభినందనలతోనే సరిపోతుందని తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ మొన్ననే చెప్పారు. అందుకే మొదటి ఆరు నెలలని ‘హనీమూన్ పీరియడ్’గా భావిస్తుంటాయి రాజకీయ పార్టీలు, వాటి ప్రత్యర్ధులు కూడా.

కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 5 నెలల్లోనే రాష్ట్రానికి ఒకటీ రెండూ కాదు… 1.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించగలిగారు. ఇది నమ్మశక్యం కాకపోవచ్చు కానీ వాస్తవమే.

ADVERTISEMENT

మిట్టల్, నిప్పన్ కంపెనీలు కలిసి అనకాపల్లి జిల్లాలో రూ.70,000 కోట్లతో భారీ స్టీల్ ప్లాంట్‌ నిర్మాణానికి ముందుకువచ్చాయి. ఇది మొదటి దశ మాత్రమే. రెండో దశలో మరో రూ.70,000 కోట్లతో దాని పక్కనే మరో ప్లాంట్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చాయి. వాటికి అవసరమైన భూములు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో ప్రస్తుతం సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయి.

టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో సిఎం చంద్రబాబు నాయుడు నిన్న అమరావతిలో సమావేశమైనప్పుడు రూ. 40,000 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో 5,000 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు అంగీకరించారని తెలిపారు.

తాజాగా రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ రూ. 65,000 కోట్ల పెట్టుబడితో రాష్ట్ర వ్యాప్తంగా 500 బయో గ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. గత నెలలో మంత్రి నారా లోకేష్‌ ముఖేష్ అంబానీని కలిసినప్పుడు గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ రంగాలలో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామని చెప్పి ఒప్పించారు. కనుక దీని కోసం నేడు సిఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో రిలయన్స్ ఎనర్జీ, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నాయి.

ఇంకా లూలూ గ్రూప్ కూడా త్వరలో ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. కానీ అది ఏయే రంగాలలో ఎంత పెట్టుబడి పెట్టబోతోందో ఇంకా ఖరారు కావలసి ఉంది.

ADVERTISEMENT
Latest Stories