జియో ‘సమ్మర్ సెన్సేషన్’ ఫుల్ డీటెయిల్స్!

Reliance Jio Summer Sensational Offers To Customersఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ఇస్తూ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తోన్న రిల‌య‌న్స్ జియో ఇటీవల మ‌రో ఆఫ‌ర్‌ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘జియో సమ్మర్ సర్‌ ప్రైజ్’ పేరిట ప‌లు సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొంది. ఇటీవ‌లే జియో ప్రైమ్ మెంబర్ షిప్ గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించి, 303 రూపాయ‌ల‌తో రీ చార్జ్ చేసుకుంటే మూడు నెల‌లు ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని తెలిపిన విష‌యం తెలి‌సిందే. అయితే ఆ ఆఫ‌ర్‌ను కొన‌సాగిస్తూనే మ‌రిన్ని సౌల‌భ్యాల‌ను క‌ల్పించింది.

తాజాగా జియో ప్ర‌క‌టించిన వివ‌రాల ప్ర‌కారం… 303 రూపాయలతో రీ-ఛార్జ్ చేసుకుంటే 28 జీబీ 4జీ డేటా (రోజుకు 1 జీబీ డేటా), అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను ఒక నెలకు రీ చార్జి చేసుకుంటే 3 నెలలు వాడుకోవచ్చు. అంతేగాక నెలకు అదనంగా 5 జీబీ 4జీ డేటా ఉచితంగా పొంద‌వ‌చ్చు. అలాగే 499 రూపాయలతో రీ ఛార్జ్ చేసుకుంటే 56 జీబీ 4జీ డేటా (రోజుకు 2 జీబీ డేటా), అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ఒక నెలకు రీ ఛార్జ్ చేసుకుంటే 3 నెలలు వాడుకోవచ్చు, దీనిలో నెలకు అదనంగా 10 జీబీ 4జీ డేటా కూడా ఉచితంగా పొంద‌వ‌చ్చు.

ADVERTISEMENT

999తో రీ ఛార్జ్ చేసుకుంటే 60 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు 3 నెలల వాలిడిటీతో అదనంగా 100 జీబీ ఉచిత డేటాను అందిస్తోంది. 1999తో రీ ఛార్జ్ చేసుకుంటే 125 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, అదనంగా 100 జీబీ ఉచిత డేటా కూడా పొంద‌వ‌చ్చు. 4999తో రీ ఛార్జ్ చేసుకుంటే 350 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు 6 నెల‌ల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. ఇక‌ 9999తో రీ ఛార్జ్ చేసుకుంటే 750 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాలిడిటీ 360 రోజుల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. ఈ ఆఫ‌ర్ల‌కు కూడా అదనంగా 100 జీబీ ఉచిత డేటా అందిస్తోంది.

అయితే జియో ప్రారంభ ఆఫర్ అయినటువంటి 149 రూపాయలతో ఇప్పటికే రీ ఛార్జ్ చేయించుకున్న వాళ్ళు, ‘జియో సమ్మర్ సర్ ప్రైజ్’ ఆఫర్లను పొందాలంటే… ముందుగా 303 రూపాయలు లేక అంతకు మించిన మొత్తంతో రీ ఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. సమ్మర్ సర్ ప్రైజ్ ముగిసిన తర్వాత మొదటి నెల 149 రూపాయల ఆఫర్ 28 రోజుల పాటు ఉంటుంది, ఆ తర్వాత ప్రస్తుతం చేసిన రీ ఛార్జ్ ఆఫర్ క్యూ కడుతుంది. 149 రూపాయల ఆఫ‌ర్‌ లో 28 రోజులకు గానూ 2 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ పొంద‌వ‌చ్చు.

జియో నుండి వస్తున్నా ఈ ప్రకటనలతో ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ కి లాభాల పంట పండుతోంది. జియో టారిఫ్ ప్లాన్స్‌ ను ప్ర‌క‌టించిన తర్వాత, ఇన్వెస్టర్లు రిలయన్స్‌ పై భారీ అంచనాలు పెట్టుకోవ‌డంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వాటా అమాంతం పెరిగిపోతోంది. కేవలం గత ఆరు వారాల్లోనే మార్కెట్ వాటాలో లక్ష కోట్ల వృద్ధి సాధించి, ఆ సంస్థ మార్కెట్ వాటా 4.44 లక్షల కోట్లకు చేరుకుందని విశ్లేష‌కులు పేర్కొన్నారు. ఇప్పటికే 8 కోట్ల మందిని తమ కస్టమర్లుగా మార్చుకున్న జియో, ఈ ఆఫర్ తో మరికొంతమందిని లాగేయడం ఖాయమని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories