Retaining Wall For Budameru Canal

గత ఏడాది కృష్ణానదికి వరదలొచ్చి విజయవాడ నీట మునిగినప్పుడు, జగన్‌ వైసీపీ నేతలు చేసిన బురద రాజకీయాలు బహుశః అందరికీ ఇంకా గుర్తుండే ఉంటాయి.

ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు నివాసం మునిగిపోకూడదనే బుడమేరు గేట్లు ఎత్తేశారని, కానీ తాను కృష్ణానదికి రీటెయినింగ్ వాల్ నిర్మించడం వలననే విజయవాడ నగరం పూర్తిగా మునిగిపోకుండా కాపాడబడిందని వాదించారు.

Also Read – రాజకీయ ప్రతీకారాల కోసమే ప్రజలెన్నుకోవాలా?

కానీ బుడమేరు పొంగి ప్రవహించినప్పుడు, మట్టితో నిర్మించిన దాని కరకట్టలు కొట్టుకుపోయి ఎక్కడికక్కడ గండ్లు పడటం వలననే వరద నీరు నగరంలోకి ప్రవేశించింది.

ఓ పక్క భారీగా వర్షం పడుతుండగా, మరోపక్క బుడమేరు పొంగి ప్రవహిస్తున్న సమయంలోనే సాగునీటిశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు వద్ద మూడు రోజుల పాటు నిలబడిపోయి రేయింబవళ్ళు గండ్లు పూడ్పించారు. ఆ రోజు ఆయన పూనుకోకపోయుంటే విజయవాడని బుడమేరు వరద ముంచెత్తుతోనే ఉండేది.

Also Read – గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు…

సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నిమ్మల బుడమేరు గండ్లు పూడ్చడంతో తమ పని అయిపోయిందని చేతులు దులుపుకోలేదు. వెంటనే బుడమేరుకి ఎక్కడెక్కడ గండ్లు పడే ప్రాంతాలలో రీటెయినింగ్ వాల్ నిర్మింపజేసి ఈ సమస్యకి శాశ్విత పరిష్కారం చేశారు. కనుక విజయవాడ ప్రజలకు ఈసారి బుడమేరు ముంపు భయం ఉండదు.




Also Read – జగన్‌ మెప్పుకంటే శతృత్వమే మేలు?