
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ యేతర రాజకీయాలలో భాగమయ్యేందుకు చెన్నై పర్యటనకు బయలుదేరారు. డీలిమిటేషన్ అంశం పై తమినాడు కేంద్రంగా మొదలైన రాజకీయాలు, డీఎంకే ఆధ్వర్యంలో జరగనున్న సమేవేశాలకు హాజరయ్యేందుకు తెలంగాణ సీఎం గా రేవంత్ అడుగు ముందుకేశారు.
Also Read – ప్రమోషన్స్ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!
కాంగ్రెస్ అధిష్టానం ఆమోద ముద్రతో రేపు స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో జరగబోయే ఈ డీలిమిటేషన్ అంశం మీద తెలంగాణ సీఎం గా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచనున్నారు రేవంత్. ఫెయిర్ డీలిమిటేషన్ పేరుతో జరగబోయే ఈ సమావేశం పట్ల స్టాలిన్ తన సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ చేసారు.
కలిసి రావడం అంటే కేవలం సమావేశానికి రావడం మాత్రమే కాదు, ఇది దేశ భవిష్యత్ ను తీర్చిదిద్దే ఒక ఉద్యమం…# FairDelimitation అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ ఉద్యమంలో పాల్గొనడానికి దక్షిణాది రాష్ట్రాలన్నీ ముందుకు రావాలంటూ స్టాలిన్ అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలను ఈ సమావేశానికి హాజరుకావాలంటూ ఆహ్వానం పంపారు.
Also Read – సీఎం నినాదాలు: పార్టీ శ్రేణుల అత్యుత్సాహం…
అయితే ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉండడంతో, వైసీపీ నేతలకు ఈ ఆహ్వానం అందినప్పటికీ వారు బీజేపీ కి వ్యతిరేకంగా అడుగు ముందుకు వేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అటు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ తో పాటుగా ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీకి కూడా స్టాలిన్ ప్రభుత్వం ఆహ్వానాన్ని అందించింది.
అవసరమైన జనాభా ఉండి కూడా పార్లమెంట్ సీట్ల పునర్విభజన విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు ఫెయిర్ డీలిమిటేషన్ చెయ్యట్లేదంటూ రేవంత్ కూడా స్టాలిన్ ఇచ్చిన నినాదంలో స్వరం కలిపారు. దీనితో తమిళనాడు ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి మద్దతు దొరికినట్లయింది. అయితే బిఆర్ఎస్ ఈ అంశం మీద ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందో చూడాలి.
Also Read – వీళ్ళు పాక్ మంత్రులా.. ఉగ్రవాదులా?
మరి బీజేపీ కి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ దక్షిణాది ఫెయిర్ డెలిమిటేషన్ ఉద్యమం రానున్న రోజులలో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.? ఏ పార్టీకి అనుగుణంగా మారుతుందో.? ఏ పార్టీకి రాజకీయ లబ్ధిని చేకురుస్తుందో, ఏ పార్టీకి రాజకీయ నష్టాన్ని కలిగిస్తుందో, తమిళనాడులో మొదలైన ఈ పోరు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ఎటువంటి మార్పులు తీసుకుతానున్నాయో రానున్న రోజులలో చూడాలి.