రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ఆయనకు మంచి చేస్తుందా చేటు చేస్తుందా?

Revanth Reddyతెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన రెండేళ్లపాటు మీడియాతో మాట్లాడనని ప్రకటించారు. గోల్కొండ హోటల్ లో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతల సమావేశానికి ఆయన హాజరు అయ్యారు. ఆ సందర్భంగా మీడియా ఆయనను పలకరించింది. కాని ఆయన మాట్లాడడానికి నిరాకరించారు. తాను రెండేళ్లపాటు మీడియాతో మాట్లాడనని అన్నారట. ఇన్నాళ్లు మీ కోసం, ఇకపై తనకోసం మానేస్తున్నానని చెప్పారట.

ADVERTISEMENT

[m9ad]

గత ఎన్నికల సమయంలో, అంతకుముందు ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో పరుష పదజాలం వాడిన రేవంత్ ఒక గుర్తంపు తెచ్చుకున్నారు. అయితే దాని వల్ల ఆయనకు చేటు జరిగిందని కొందరి విశ్లేషకుల అభిప్రాయం. ఆయన ఏకంగా తన సొంత సీట్లో కూడా ఈసారి ఓడిపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారట. దీనితో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా ఇది ఆయన అభిమానులకు నిరాశపరిచేదే. కాకపోతే తన రాజకీయ భవిష్యత్తుకు ఇదే మంచిదని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారట.

రెండు తెలుగు రాష్ట్రాలలో రేవంత్ రెడ్డి విలక్షణమైన వక్తలలో ఒకరు. ఆయన స్పీచ్ లతో ప్రజలకు తేలికగా దగ్గర కాగలరు. అటువంటి నేత మౌనం దాలిస్తే అది కాంగ్రెస్ కు ఇబ్బందికరమే. అయితే మాటలు మానేసి గ్రౌండ్ లెవెల్ లో ఆయన పర్యటించి ప్రజలకు చేరువ కావాలని ఆయన ఆలోచనట. అదే చేస్తే మంచిదే. మరోవైపు అవకాశం వస్తే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నారు రేవంత్. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

ఒకవేళ అక్కడ అవకాశం లభించకుంటే మరే ఇతర స్థానం నుంచైనా పోటీ చేయవచ్చని తెలుస్తోంది. అయితే కొడంగల్ కు దూరం జరిగితే రాజకీయంగా నష్టం కలగవచ్చని ఆయన మహబూబ్ నగర్ లోనే పోటీ చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ కిందకు వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. మొత్తం అన్ని సీట్లు తెరాస ఖాతాలోకే వెళ్లిపోయాయి. ఈ క్రమంలో మహబూబ్ నగర్ నుండి పోటీ అంటే అంత తేలిక కాదనే అర్ధం అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories