Revanth Reddy on Bhanakacherla Project Politics

బిఆర్ఎస్ పార్టీ బనకచర్ల ప్రాజెక్టు పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలలో ‘తెలంగాణ సెంటిమెంట్’ రగిలించి, అధికార కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి రాజకీయ ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తోందని ఇదివరకే చెప్పుకున్నాము. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట చెప్పారు.

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో కలిసి మంగళవారం ప్రజా భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో జరిగిన ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తుడిచి పెట్టుకపోయింది. కనుక దాని పునరుజ్జీవం కోసమే ఆ పార్టీ నేతలు నీళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. నన్ను, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని దెయ్యాలు, భూతాలు అని చిత్రీకరిస్తున్నారు.

Also Read – నిర్మాణం ఎలాగూ చాతకాదు కనీసం..

గోదావరి నదిలో 3,000 క్యూసెక్కుల నీళ్ళు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయని, వాటిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రాజెక్టులు కట్టుకొని వాడుకోవచ్చని చెప్పిందే కేసీఆర్‌. ఇప్పుడు ఆయన ఫామ్‌హౌస్‌లో కూర్చొని క్షుద్ర పూజలు చేస్తున్నట్లు బనకచర్లపై క్షుద్ర రాజకీయాలు, కుట్రలు చేస్తున్నారు.

2015, సెప్టెంబర్‌ 18న కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో కృష్ణా జలాలలో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకోవచ్చని హరీష్ రావు సంతకం పెట్టి వచ్చారు.

Also Read – షర్మిల – కవిత ప్యారలల్ యూనివర్స్ లో ఉన్నారా.?

2019లో జగన్‌ ముఖ్యమంత్రి కాగానే ఆయనని హైదరాబాద్‌ పిలిపించుకొని గోదావరి జలాలను ఏవిదంగా పెన్నాకు తరలించాలో నేర్పింది కూడా కేసీఆరే. రోజా ఇంటికి వెళ్ళి ఆమె పెట్టిన చేపల పులుసు టిని అందుకు ప్రతిగా రాయలసీమకు గోదావరి జలాలు పారిస్తానని మాట ఇచ్చింది కేసీఆరే.

కృష్ణ, గోదావరి నీళ్ళ విషయంలో కేసీఆర్‌ ఈవిదంగా వ్యవహరించి, ఇప్పుడు బనకచర్ల పేరుతో మునిగిపోతున్న బిఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు,” అని సిఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

Also Read – మిథున్ రెడ్డి స్వామిభక్తి ప్రదర్శిస్తే పరవాలేదు కానీ..

ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ, బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత వివాదంలో హరీష్ రావు తన ఉనికిని కాపాడుకునేందుకే బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని తెర పైకి తెచ్చి రాజకీయాలు చేస్తున్నారు. కానీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ దీని గురించి ఎక్కడా మాట్లాడటం లేదు.




ఇదంతా ఆ పార్టీ ఆడుతున్న రాజకీయ డ్రామాయే తప్ప మరొకటి కాదు. దిగువన ఏపీలో వచ్చిన గోదావరి జలాలు వృధాగా సముద్రంలోకి వదిలేస్తే పర్వాలేదా? వాటిని వాడుకుంటే తప్పేలా అవుతుంది? అని ప్రశ్నించారు.