రేవంత్ లక్ష్యం… సిఎం పీఠం…!

revanth-reddy-tdp-ts-resign-telanganaరేవంత్ రెడ్డి… తెలంగాణా నేతగా ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో… ఆంధ్రప్రదేశ్ లోనూ రేవంత్ కు వీరాభిమానులు ఉన్నారు. రేవంత్ మాట్లాడే తీరు అలా ఉంటుంది మరి! తెలుగుదేశం పార్టీ నేతగా ప్రత్యర్ధులపై విమర్శన బాణాలు విసురుతుంటే… కార్యకర్తల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేది. కానీ ఇదంతా గతం. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడిపోయారు.

టిడిపి నుండి నేతలు మరో పార్టీలోకి జంప్ కావడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు చాలా మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి జంప్ కాగా, రేవంత్ మాత్రం అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నాడు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు గానీ, రాహుల్ గాంధీ సమక్షంలో ముహూర్తం ఖరారు కావడమే ఆలస్యం అన్న టాక్ అయితే బలంగా వినపడుతోంది.

ADVERTISEMENT

సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి రేవంత్ ఏ స్థాయిలో ఉంటారు? అనేదే అసలు ప్రశ్న. ఎందుకంటే… ప్రస్తుతం తెలంగాణాలో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చాలా కీలకం. ఓ మాటలో చెప్పాలంటే… టిడిపి సిఎం క్యాండిడేట్. మరి అదే పొజిషన్ కాంగ్రెస్ లోనూ లభ్యమవుతుందా? అంటే అది శేషప్రశ్నే గానీ, రేవంత్ లక్ష్యం మాత్రం ముఖ్యమంత్రి పీఠమే అని స్పష్టమవుతోంది.

కొడితే కుంభస్థలమే కొట్టాలి అన్న రీతిలో… ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ పై తిరుగుబాటే తన లక్ష్యం అని చెప్పడం ద్వారా…. కేసీఆర్ ను గద్దె దించి, ఆ స్థానంలో తాను కూర్చోవాలని ఊవ్విళ్ళూరుతున్నట్లుగా రేవంత్ పరోక్షంగా చెప్తున్నాడు. అయితే ఈ సారికి కాకపోయినా, వచ్చేసారికి అయినా అది సాధ్యపడుతుందేమో అన్న ఆశతోనే టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరినట్లుగా పొలిటికల్ టాక్.

ADVERTISEMENT
Latest Stories