మోడీ అంతం కోసం చిన్నమ్మ శపథం?

Sasikala Natarajan Gets a Special Kitchen in Jailఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు జైల్లో ఉన్న శశికళ ఇన్నాళ్లకు నవ్వారు. మేనల్లుడు టీటీవీ దినకరన్‌ ఘనవిజయం విషయం తెలిసి జైలు లోనే ఉన్న తన బంధువు ఇళవరసితో ఆనందాన్ని పంచుకున్నారు. జయలలిత తర్వాత అంతగా ప్రభావితం చేయాలనుకున్న శశికళకు ఏడాదిగా అన్నీ ఎదురు దెబ్బలే తగిలాయి.

తమిళనాడును తన గ్రిప్ లోకి తెచ్చుకోవాలని ప్రయత్నంలో భాగంగానే తనను మోడీ జైలుకు పంపారని, పార్టీని తనకు కాకుండా చేసారని ఆమె బలంగా నమ్ముతున్నారట. వచ్చే ఎన్నికలలో పార్టీని గెలిపించి బీజేపీని భూస్థాపితం చేస్తానని శపథం చేసిందట చిన్నమ్మ.

ADVERTISEMENT

మరోవైపు జయలలిత పోటీ చేసిన స్థానంలో తన మేనల్లుడు గెలుపొందడంతో ఆమెతోపాటు ఇటు రాష్ట్రంలోనూ మద్దతుదారులు పండుగ చేసుకుంటున్నారు. ఇంతటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా గతంలో జయలలిత సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ తెచ్చుకోవడంతో శశికళ ఆనందానికి అవధులు లేవట.

ADVERTISEMENT
Latest Stories