శర్మాజీ బర్త్-డే కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నారా..?

Rohit Sharma Birthday

ఈ ఏడాది ఐపీఎల్ మొదలయినప్పటినుండి ముంబై జట్టు తమ అభిమానులకు షాక్ ఇస్తూనే వస్తున్నారు. గత 12 ఏళ్లగా ఆ జట్టు ఎప్పుడూ వారు ఆడిన మొదటి లీగ్ మ్యాచ్ ను గెలిచినదే లేదు. కానీ, ఈ సీజన్ తమ మొదటి మ్యాచ్లో కోల్కతా జట్టుపై 6 వికెట్లతో గెలిచి చరిత్ర తిరగరాస్తూ అభిమానులకు ఫుల్ జోష్ అందించారు.

మరి చరిత్రను చెల్లగొట్టిన సందర్భమో ఏమో తెలియదు గాని, మొదటి మ్యాచ్లో గెలిచిన ముంబై జట్టు మళ్ళీ విజయాన్ని చూసేందుకు మరొక 5 మ్యాచ్లు పట్టింది. వరుసగా ఢిల్లీ, రాజస్థాన్, బెంగళూరు, పంజాబ్ తో ఆడిన 4 మ్యాచ్లలో ఓడి తిరిగి గుజరాత్ పై గెలిచి ఈ సీజన్లో 2వ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ADVERTISEMENT

ఈ 2వ గెలుపు కూడా ముంబై చరిత్రను తిరగరాసిన విజయమే. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఎంట్రీ ఇచినప్పటినుండి, గుజరాత్ హోమ్ గ్రౌండ్లో 4 మ్యాచ్లు ఆడిన ముంబై, 4 మ్యాచ్లలోను ఓడి చెత్త రికార్డును మూటగట్టుకోగా, ఈ సీజన్లో ఆ రికార్డును చెరిపేస్తూ మొదటిసారి అహ్మదాబాద్ గ్రౌండ్లో విజయం సాధించారు.

ఆ మ్యాచ్ను 99 పరుగులతో గెలుచుకున్న ముంబై తిరిగి గాడిన పడిందనుకునేలోపలే, చెన్నై పై 103 పరుగుల ఘోరమైన ఓటమికి గురయింది ముంబై ఇండియన్స్. ఇంతటి భారీ ఓటమి తరువాత వారం రోజుల గడువుతో రంగంలోకి దిగనుంది ముంబై జట్టు.

ఇవాళ ముంబై వేదికగా హైదరాబాద్ జట్టుతో తలపడనుంది ఎం.ఐ జట్టు. ఇంతకు మించి రేపు ఆ జట్టు లెజెండరీ కెప్టెన్ మరియు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 39వ పుట్టినరోజు కావటం అభిమానులను ఇంకా ఆసక్తిపరుస్తుంది. ముంబై చివరిగా ఆడిన 3 మ్యాచ్లలోను రోహిత్ లేకపోవటం ఆ జట్టుకు ఇబ్బంది గా నే మారింది.

3 మ్యాచ్ల విశ్రాంతి తరువాత రంగంలోకి దిగుతున్న విశేషంగా రోహిత్ ఈ మ్యాచ్లో చాలా ఫ్రెష్ గా ఉండటం సహజం. పైగా, పుట్టినరోజుకు కేవలం ఒక్క రోజు మాత్రమే ఉండటంతో నేడు శర్మాకి బ్యాట్ నుండి పరుగుల వరద పక్కా అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఈ తరుణంలోనే రోహిత్ శర్మ మ్యాచ్ కు ఇంకా కొద్ది గంటలే మిగిలుంది అనగా, మధ్యాహ్న సమయంలో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఒక ఓరేంజ్ తో ఏ.ఐ జెనరేటెడ్ పిక్ పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసాడు. ఎస్.ఆర్.హెచ్ ను ఓరేంజ్ ఆర్మీ అని పిలవటం గమనార్హం. ఇవాళ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్లో శర్మాజీ అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నాడా…?

ADVERTISEMENT
Latest Stories