
2013 ఐపీఎల్ వరుకు ఒక్క కప్ కూడా లేని ముంబై ఇండియన్స్ జట్టు, 2013 సీజన్ మధ్యలో విజయాల కొరత తో అప్పటి కెప్టెన్ రికీ పాంటింగ్ స్వయంగా రోహిత్ శర్మ కు కెప్టెన్సీ బాధ్యతలను అందజేశాడని వెల్లడించారు. అయితే, అప్పటి ఆ నిర్ణయం ముంబై తలరాతను ఒక ఛాంపియన్ గా మార్చిందని చెప్పాలి.
ఆ ఒక్క నిర్ణయం వారికి గడిచిన 7 ఏళ్ళల్లో 5 ఐపీఎల్ కప్పులను తెచ్చిపెట్టింది. రోహిత్ శర్మ 2013 లో కెప్టెన్ గా మారాడు, అదే సీజన్ లో ముంబై జట్టుకు తమ మొదటి ట్రోఫీ ను కూడా అందించాడు. ఇక, కేవలం కెప్టెన్ గానే కాక, 2012 – 2019 వరుకు బ్యాటర్ గా కూడా రోహిత్ శర్మ ఔరా అనిపించాడు. ఎంత కాదనుకున్నా, బ్యాటర్ గా రోహిత్ అక్కడి నుండి నిలకడగా ఆడలేకపోయాడు.
Also Read – స్మితా సభర్వాల్: ఈమెను ఎలా డీల్ చేయాలబ్బా!
కెప్టెన్ గా మారిన 7 ఏళ్లకే ముంబై కు 5 ట్రోఫీ లను అందించి, ఒకే ఫ్రాంచైజ్ కు 5 కప్పులను అందించిన తొలి కెప్టెన్ గా చరిత్ర పుస్తకాల్లో తన పేరు బంగారపు అక్షరాలతో లిఖించుకున్నాడు హిట్ మాన్. ముంబై కు 5 కప్పులను తెచ్చిపెట్టాడని అక్కడి అభిమానులకు కూడా రోహిత్ ఒక ఆరాధ్య దైవంగా మారాడు. అయితే, ఇదంతా కూడా రోహిత్ గత ఐపీఎల్ చరిత్రనే చెప్పాలి.
కానీ ప్రస్తుతం ముంబై జట్టులో రోహిత్ కు ఆ స్థాయి ఆదరణ దక్కుతుందా అంటే అభిమానులు మాత్రం నో అనే సమాధానమే చెపుతారు. మరి ఇంతటి కీర్తి- ప్రఖ్యాతలు, పేరు-ప్రతిష్టలు కలిగిన రోహిత్ ను ముంబై యాజమాన్యం చడి చప్పుడు లేకుండా కెప్టెన్సీ నుంచి పక్కకు తొలగించారు.
Also Read – వైసీపీ నేతలు ధీమాగానే ఉన్నారు మరి ప్రభుత్వం?
2022 లో గుజరాత్ కు కెప్టెన్ గా మారిన తొలి సీజన్ లోనే ఆ జట్టుకు ట్రోఫీ అందించి, 2023 లో మరోసారి ఆ జట్టు ను ఫైనల్స్ కు నడిపించిన సారధి- మాజీ ముంబై ఆటగాడు ‘హార్దిక్ పాండ్య’ ను తిరిగి కొనుగోలు చేసి, జట్టు కెప్టెన్సీ పగ్గాలను నేరుగా పాండ్య కు అందించారు ముంబై యాజమాన్యం. అయితే, ఈ ఒక్క సంఘటన ముంబై భవిష్యత్ ను తలక్రిందులు చేసిందా అన్నట్టుగా నటి నుంచి ముంబై జట్టు ఛరిష్మా తగ్గుతూ వస్తుంది.
ఈ నిర్ణయం అటు జట్టుకే కాదు కొత్త సారధిగా బాధ్యతలు చీపుట్టిన పాండ్య కు కూడా కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. 2024 సీజన్ కు కెప్టెన్ గా వ్యవహరించిన పాండ్య కు ఆ సీజన్ ఒక పీడ కల గానే మిగిలింది. వెళ్లిన ప్రతి చోటా, అభిమానుల చేతిలో ఛీత్కారం అందుకోవటమే కాకా, టీం లో మహా- మహులు ఉన్నప్పటికీ కనీసం ప్లే-ఆఫ్స్ కు కూడా అర్హత సాధించలేక, ఏకంగా పాయింట్ల పట్టిక లో 10 వ స్థానంలో నిలిచింది ముంబై జట్టు.
Also Read – కంచలో కుమ్మకులు.. కుమ్ములాటలు భలే ఉందే!
ఇక, ఈ 2025 సీజన్ చూసుకున్నా, ఇప్పటికే 4 మ్యాచ్లు ఆడిన ముంబై, కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే సొంతం చేసుకుని మరోసారి రోహిత్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. ముంబై ప్రాంజైజీ తమ ప్రతిష్ట గా చూసుకోవాల్సిన ‘రోహిత్’ ను అవమానించి తమ లెగసీ ను తామే తగ్గించుకుంటున్నారు అనే వాదన వినిపిస్తుంది.
ఇటు పక్క మరొక లెజెండరీ టీం చెన్నై, తమ లెగసీ మొత్తాన్ని ఒక్క ప్లేయర్ వైపే మళ్లిస్తు చెన్నై ఛరిష్మాను కొనసాగిస్తున్నారు. ఆయనే ‘ఎం.ఎస్.ధోని!’. ధోని ప్రస్తుతానికి జట్టుకి సారధి గా బాధ్యతలు వహించాహదం లేదు, అలా అని బ్యాటింగ్ లో గత మెరుపులు మెరిపించడం లేదు, కానీ ధోని కూడా రోహిత్ మాదిరి చెన్నై జట్టుకి అనేక విజయాలను అందించాడు. ఆ గౌరవం తోనే చెన్నై యాజమాన్యం ఇప్పటికి ధోని పట్ల అదే మర్యాదను కొనసాగిస్తున్నారు. డ్
ఇలా రెండు ఛాంపియన్స్ టీమ్స్ కూడా అత్యంత విభిన్నమైన పద్దతులలో నడుస్తు ఒకరు ఆ జట్టు అభిమానులకు ఆనందాన్ని అందిస్తే మరొకరు వారి అభిమానులకు విషాదాన్ని మిగులుస్తున్నారు.