
ఓ సినిమా తీస్తున్నప్పుడు దర్శకుడు ఏవిదంగా మద్యలో గాడి తప్పుతాడో, తప్పినా దానిని గుర్తించలేడో, ఒకవేళ గుర్తించినా ఏమీ చేయలేక అలాగే విడుదల చేసేసి నష్టపోతాడో, అదే విదంగా రాజకీయాలలో ఉన్నవారు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు కూడా గాడి తప్పి ఎన్నికలలో బోర్లా పడుతుంటారు.
ఇందుకు టీడీపీ, వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలే చక్కటి ఉదాహరణలు. వీటిలో వైసీపీ బోర్లా పడటానికి అనేక కారణాలున్నాయి. అవందరికీ తెలుసు.
Also Read – పాపం రాజాసింగ్.. రాజీనామాతో రాజకీయ అనాధగా మారారు!
వైసీపీ ఓటమికి రెండు రకాల కారణాలు కనిపిస్తున్నాయి. 1 స్వయంకృతాపరాధాలు, 2. కూటమి సమీకరణాలు.
ఆ మూడు పార్టీలు కలిస్తే వైసీపీ ఓటమి తప్పదని జగన్ ముందే ఒప్పేసుకున్నారు కనుక ఆ ఓటమిని ఈవీఎంల పద్దులో వ్రాసేసి తప్పుకున్నారు. కానీ ఎట్టి పరిస్థితులలో వైసీపీని గెలిపించుకునే ప్రయత్నంలో చేసిన పెద్ద తప్పుల వల్లనే ఒడిపోయారని చెప్పక తప్పదు.
Also Read – తెలంగాణలో గోదావరి నీళ్ళని వాడుకోలేరు కానీ..
మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలని పట్టించుకోకుండా వాలంటీర్లను, ఐప్యాక్, సోషల్ మీడియాని నమ్ముకోవడం అతిపెద్ద పొరపాటని ఓటమి తర్వాత జగన్ మెల్లమెల్లగా ఒప్పేసుకున్నారు కూడా.
కనుక ఇకపై కార్యకర్తలకి ప్రాధాన్యం ఇస్తానని జగన్ చెపుతున్నారు. కానీ ఆయనకు చాలా నమ్మకంగా శల్య సారధ్యం చేసి ఓడించి పెట్టిన సజ్జల రామకృష్ణ రెడ్డి మాత్రం కార్యకర్తల కంటే ‘సోషల్ మీడియా వారియర్స్’ బెటర్ అని చెపుతున్నారు. వచ్చే ఎన్నికలలో సోషల్ మీడియా వారియర్స్ వల్లనే వైసీపీ గెలుపు సాధ్యం అని తేల్చి చెప్పేశారు.
Also Read – బీసీ రిజర్వేషన్స్: బీఆర్ఎస్‌లో గందరగోళం
సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల మద్య భీకర యుద్ధాలు జరుగుతుంటాయి. కనుక ఆ యుద్ధంలో గెలిస్తే ఎన్నికలలో గెలిచేయవచ్చని సజ్జల అనుకుంటున్నట్లున్నారు. అందుకే ప్రత్యర్ధి పార్టీలపై పైచేయి సాధించాలని, ప్రభుత్వ వైఫ్యల్యాలను ఎండగట్టాలని, వైసీపీ చేసిన మేలుని ప్రజలకు గుర్తు చేయాలని సజ్జల సోషల్ మీడియా వారియర్స్ కు సజ్జల చెప్పారు.
అయితే సోషల్ మీడియాలో రెచ్చిపోవడం వల్లనే పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారని, ఆ కేసులో ఆయన తన పేరు ప్రస్తావించడంతో హైకోర్టుకి పరిగెత్తి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాననే సంగతి సజ్జల అప్పుడే మరిచినట్లున్నారు.
సోషల్ మీడియాలో రెచ్చిపోతే ఎలాగూ కేసులు తప్పవు. కానీ ఎన్నికలలో ఓటమికి సోషల్ మీడియాలో వైసీపీ దుష్ప్రచారాలు కూడా ఒక కారణమని సజ్జల అప్పుడే మారిచిపోయారా? వైసీపీ సోషల్ మీడియా చీఫ్ తన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి నిర్వాకల వలన వైసీపీలో ఎంతమంది ఇప్పడు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో సజ్జలకు తెలియదా?ఓటమి తర్వాత తండ్రీ కొడుకులు ఇద్దరినీ జగన్ పక్కన పెట్టేసిన సంగతి అప్పుడే మరిచిపోయారా?అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాని నమ్ముకొని మళ్ళీ వైసీపీని గెలిపించుకోగలమని నమ్మకంగా జగన్‌కు చెప్పి ఒప్పించగలిగితే సజ్జల మేలుని కూటమి ప్రభుత్వం ఎన్నటికీ మరిచిపోదు.