తూచ్! సజ్జల కన్వీనియంట్‌గా మాట మార్చేశారు

Sajjala-Rama-Krishna-Reddyజగన్ శాస్వితం కాదు.. ఐదేళ్ళే ఉంటారు. అవును ఈ మాట అన్నది మరెవరో కాదు వైసీపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే ఆయన చెప్పింది ముఖ్యమంత్రి పదవి గురించి కాదు… వైసీపీ అధ్యక్ష పదవి గురించి. వైసీపీ ప్లీనరీలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేత రాజీనామా చేయించి బయటకు పంపించిన తర్వాత సిఎం జగన్మోహన్ రెడ్డిని పార్టీ శాశ్విత అధ్యక్షుడుగా పట్టాభిషేకం చేసుకొన్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అటువంటి రాజరిక పోకడలకు తావు లేదని, నిర్ణీత కాలవ్యవధిలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిపి కొత్త అధ్యక్షుడుని ఎన్నుకోవలసిందేనని కేంద్ర ఎన్నికల కమీషన్‌ స్పష్టం చేసింది. అంతేగాదు… ఈ విషయంపై పార్టీ వైఖరిని మీడియా ద్వారా ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని కూడా కోరింది.

వైసీపీలో బొత్స సత్యనారాయణ వంటి అనుభజ్ఞులు చాలా మందే ఉన్నారు. వారికీ ఈవిషయం బాగా తెలుసు. కానీ పిల్లి మెడలో గంట ఎవరు కడతారన్నట్లు అందరూ చప్పట్లు కొట్టి తమ అధినేతను అభినందించి తెలివిగా తప్పుకొన్నారు. ఒకవేళ సీనియర్ల సలహాలతో నిర్ణయాలు తీసుకొంటూ, పరిపాలన చేస్తుంటే నేడు వైసీపీ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఈవిదంగా ఉండేదే కాదు. కానీ వైసీపీలో సర్వం జగన్మయం కనుక ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తోంది.

ఈసీ అభ్యంతరాలపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “జగన్మోహన్ రెడ్డికి శాశ్విత అధ్యక్ష పదవి అసలు ఇష్టం లేదు. ఆయన అప్పుడే నిరాకరించారు. కనుక మేము ప్లీనరీ మినిట్స్‌లోఈ విషయాన్ని చేర్చలేదు. ఆరోజు జగన్‌ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టారు కానీ శాశ్విత అధ్యక్షుడుగా కాదు. కేవలం ఐదేళ్ళ కాలానికే ఆయన అధ్యక్షుడుగా కొనసాగుతారు. ఆ తర్వాత ఎన్నికల నియమావళి ప్రకారం మళ్ళీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడుని ఎన్నుకొంటాము. ఇదే విషయం మేము ఎన్నికల కమీషన్‌కు కూడా తెలియజేశాము,” అని చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories