సకల ‘శాఖా’ మంత్రి…సకల ‘కళా’ వల్లభుడయ్యారా.?

sajjala_ramakrishna_reddy_

పాదయాత్రలు చేసి, ఓదార్పు యాత్రలు చేసి, ముద్దులు పెట్టి, బుగ్గలు నిమిరి జగన్ సాధించుకున్న ముఖ్యమంత్రి పదవిని గత ఐదేళ్లు అప్పలంగా, అనధికారికంగా వాడుకున్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి. వైసీపీ ప్రభుత్వ ‘సలహాదారుగా’ ప్రభుత్వంలోకి అడుగుపెట్టిన సజ్జల అతి కొద్దీ నెలలకే ‘సకల శాఖ మంత్రి’గా ప్రభుత్వంలో చక్రం తిప్పారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే లు మొదలుకుని ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులు వరకు ఎవరికి ఏ సలహా కావాలన్నా, ఎవరు ఎలా ప్రభుత్వాన్ని నడపాలన్నా, అలాగే ప్రభుత్వం తరుపున ఏ అధికారికి ఎలా నడుచుకోవాలి అనుకున్నా అంతా కూడా సజ్జల గారి కనుసన్నలలోనే జరిగేది.

ADVERTISEMENT

ప్రతిపక్ష పార్టీల నేతలను బూతులు తిట్టడం దగ్గర నుండి, వారి కుటుంబంలోని ఆడవారి పై అసభ్యకర పోస్టులు పెట్టడం వరకు, వ్యక్తిగత విమర్శలు నుంచి కక్ష్య సాధింపు రాజకీయాల వరకు ‘వన్ మాన్ షో’ మాదిరి గత ఐదేళ్లు రాష్ట్రంలో తన పెత్తనం సాగించారు సజ్జల.

అయితే గత ఐదేళ్ల సజ్జల గారి సౌజన్యం ఏపాటిదో, దాని ఫలితంతో రాష్ట్రంలో ఎంతటి విధ్వంసం జరిగిందో నేడు కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకు వస్తుంది. జగన్ దగ్గర తనకున్న విచక్షణాధికారాన్ని సజ్జల ఏమేరకు దుర్వినియోగం చేసారో తెలియచెప్పడానికి జత్వాని కేసు ఉదాంతం ఒక చక్కటి ఉదాహరణ.

ఈ కేసులో సజ్జల గారు ప్రభుత్వ సలహాదారునిగా కాకుండా హోమ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినట్టు పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేస్తూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఇందుకు గాను జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ లు కటకటాలపాలయ్యారు. ఇందులో అప్పటి ఇంటిలిజెన్స్ డీజీ..పీఎస్ఆర్ ఆంజనేయులు A2 గా, విజయవాడ సీపీ కాంతి రాణా A3 గా, అలాగే A6 గా విజయవాడ డీసీపీ విశాల్ గున్ని పై కేసులు నమోదయ్యాయి.

అయితే కూటమి ప్రభుత్వం ఈకేసు తాలూకా తీగ లాగితే డొంక మాత్రం సజ్జల గారి వద్దకు వచ్చి ఆగింది. ఇక గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద వైసీపీ మూకలు చేసిన అమానుష దాడి కేసు మూలాలు కూడా సజ్జల వైపు చూపిస్తున్నాయి. ఇలా హోమ్ శాఖకు సంబంధించిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అన్ని కూడా సజ్జల ఆదేశాలతోనే జరిగాయన్నది సుస్పష్టమయ్యింది.

ఇక కడప జిల్లాలోని సీకే దీన్నే ప్రాంతంలో 52 ఎకరాల అటవీ భూమిని సజ్జల కుటుంబం గత కొన్నేళ్లుగా అక్రమంగా అక్రమించుకుని నిర్మాణాలను చేపట్టినట్టు, వ్యవసాయ కార్యకలాపాలకు వాడుకుతున్నట్టు కూటమి ప్రభుత్వం ఆధారాలతో నిర్దారించింది. అలాగే దీని పై లోతైన విచారణకు ఆదేశించింది.

ఇదిలా ఉంటే తాజా సెన్సేషన్ చీమకుర్తి శ్రీకాంత్, వనం దివ్యా(రీతూ చౌదరి), ధర్మ సింగ్ ల భూ పంచాయితీ వ్యవహారంలో కూడా అసలైన సూత్ర దారి, పాత్ర దారి సజ్జల గారే అనేది నర్మగర్భంగా బయటకొచ్చింది. ధర్మ సింగ్ అనే సబ్ రిజిస్టర్ ను గోవాలో కిడ్నాప్ చేసి దాదాపు 700 వందల కోట్ల విలువైన భూముల కబ్జా జరిగిందని, ఆ దందాలో కూడా సజ్జల గారి పేరే ప్రముఖంగా వినిపిస్తుంది.

ఇలా గత వైసీపీ ప్రభుత్వ అవినీతి చిట్టా ఏ ఒక్కటి బయటకొచ్చినా దాని మూలాలు మాత్రం సజ్జల కుటుంబం ముంగిట వాలుతున్నాయి. దీనితో గత ఐదేళ్లు సకల శాఖ మంత్రిగా సజ్జల గారు వెలగబెట్టింది ‘హోదా కాదు దందా’ అనేది స్పష్టమయింది. దీనితో సజ్జల గారు సకల ‘కళా’ వల్లభుడే అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

ADVERTISEMENT
Latest Stories