ఎన్నో ఏళ్లుగా సంక్రాంతి అంటే సొంతూరు అనేలా ఉపాధి కోసం ఎక్కడెక్కడికి వెళ్లిన వాళ్ళు సైతం తమ కుటుంబ సభ్యులతో కలిసి సొంతూర్లకు చేరుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తుంది. అయితే ఈ సంక్రాంతి..సొంతూరు అనే కాన్సెప్ట్ లో ఎక్కువగా లాభపడేది మాత్రం ట్రావెలింగ్ సంస్థలే.
ఏపీ, తెలంగాణలో ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవలు ప్రకటించారు. ఈ నెల 10 నుంచి 19 వరకు ఏపీ ప్రభుత్వం, 11 నుంచి 16 వరకు తెలంగాణ గవర్నమెంట్ పాఠశాలలకు, కళాశాలలకు సెలవలు ప్రకటించాయి. దీనితో ఇక వచ్చిన ఈ వారం రోజుల హాలిడేస్ ను తమ సొంత గ్రామాలలో జరుపుకోవడానికి సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో అటు రైళ్లు, ఇటు బస్సులు, ప్రయివేట్ వాహనాలు పాసెంజర్లతో కిక్కిరిసి పోవడం గమనించవచ్చు. ముఖ్యంగా ఏపీలోని గోదావరి జిల్లాలలో ఈ సంక్రాంతి సందడి మంచి జోష్ తో కూడుకొని ఉంటుంది. కోడి పందాలు, రంగవల్లు పోటీలు, గాలి పటాలు, గంగిరెద్దు మేళాలు, హరిదాసుల భజనలు, భోగి మంటలు, పిండి వంటలు ఇలా కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి ఆహ్లాదంగా చేసుకునే ఈ పండుగ నానాటికి కాస్టలీ మారిపోతుంది.
ప్రభుత్వం తరుపున ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా అరకొర వసతులు అన్నట్టుగా ప్రజల నుంచి నిర్లిప్తతే ఎదురవుతుంది. అయితే ఈ సంక్రాంతిని కాష్ చేసుకోవడానికి ఎప్పటి మాదిరిగానే ప్రవైట్ ట్రావెల్స్ తమ ‘నిలువు దోపిడీ’ పథకాన్ని ప్రవేశ పెట్టింది. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో సప్లై లేదంటూ పాసెంజర్ల నుండి ఎక్కువ మొత్తంలో టికెట్ రేట్లు వసూలు చేస్తున్నారు ప్రయివేట్ యాజమాన్యం.
ముఖ్యంగా హైద్రాబాద్ నుంచి ఏపీకి తరలి వచ్చే వారి శాతం చాల ఎక్కువగా ఉంటుంది. అందు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ ప్రయివేట్ యాజమాన్యం దందాకు అడ్డుకట్ట వేసి మధ్యతరగతి వాడికి అందుబాటులో రవాణా చార్జీలు ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు సొంతూర్లకు వెళ్లే ప్రజలు.
సంక్రాంతి అంటే సందడి అనే రోజుల నుంచి సంక్రాంతి అంటే జేబులు కాళీ అనే రోజులకు చేరుకుంటున్నాం అంటున్నారు సాధారణ ప్రజానీకం. ఇక ఈ వీకెండ్ నుంచి రెండు రాష్ట్రాలలోని బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, టోల్ ప్లాజా లో ఈ సంక్రాంతి హడావిడి దర్శనమివ్వబోతుంది.
అలాగే కూటమి ప్రభుత్వం ఈ సంక్రాంతికి తమ సొంత ఊర్లకు వచ్చిన వారికీ తమ పాలన ఎలా ఉందో వాహనదారులకు రోడ్ల మీదే తెలిసేలా రహదారుల నిర్మాణాలు, మరమత్తులు చేపట్టింది. ఇక ఈ సంక్రాంతి ఏపీ ప్రభుత్వ తీరుకు ఒక పరీక్ష వంటిదనే చెప్పాలి. మరి ఈ పరీక్షలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారో వేచి చూడాల్సిందే.




