“సావిత్రి” బయోపిక్ లో చూపిస్తారా?

Savitri Biopic‘మహానటి’ సావిత్రి గురించి ఈ రోజు కొత్తగా చెప్పేదేముంది. అంత గొప్ప నటి కాబట్టే తెలుగులో సావిత్రి బయోపిక్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో సావిత్రి గురించి ప్రేక్షకులకు తెలియని అనేక విషయాలు బయటకు వస్తాయని సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే… సావిత్రి అంత గొప్పనటి అయినా గానీ, జీవిత చరమాంకంలో… ఆర్ధికం మొదలుకుని అన్ని విధాలుగా ఇబ్బందులు పడిందని… చివరికి మద్యానికి బానిసై చనిపోయిందని వార్తలు వినపడుతుంటాయి.

ఇందులో ఎంత వాస్తవం ఉందో “సావిత్రి” బయోపిక్ లో బయటకు వస్తుంది గానీ, సావిత్రి నటించిన “మిస్సమ్మ” సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అంశం వెలుగుచూసింది. ‘మిస్సమ్మ’ సినిమాను వాస్తవానికి తొలుత భానుమతి గారితో ప్రారంభించారని, ఆ తర్వాత భానుమతికి, చిత్ర దర్శకుడు చక్రపాణికి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో ఆ సినిమా నుండి భానుమతి తప్పుకోగా, ఆ స్థానంలోనే సావిత్రి నటించి, తన ఖాతాలో మధురమైన విజయాన్ని వేసుకుందని తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం.

ADVERTISEMENT

దీనిపై హీరో సుమంత్ కూడా స్పందిస్తూ… “ఆశ్చర్యం… ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసిందంటూ” ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన పలు ఫోటోలు కూడా విడుదలయ్యాయి. మరి “మిస్సమ్మ” వచ్చి సావిత్రి ఖాతాలో ఎలా పడిందో, తెరవెనుక మంత్రాంగం ఏం జరిగిందో అన్న విషయం “సావిత్రి” బయోపిక్ లో చూపిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ‘మిస్సమ్మ’ సెట్స్ లో చక్రపాణితో పాటు భానుమతి ఉన్న ఫోటోలు ఈ సందర్భంగా చక్కర్లు కొడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories