పవన్ కళ్యాణ్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు

Shilpa Chakrapani Reddyజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రతిపక్ష పార్టీ నాయకుల విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా మాజీ ఎమ్మెల్సీ శిల్ప చక్రపాణిరెడ్డి ఆయనపై విమర్శలు కురిపించారు. పవన్ కళ్యాణ్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాలంటే సినిమా తీసినంత ఈజీ కాదని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రత్యేక హోదాపై కాని, రాష్ట్ర సమస్యలపై కాని, కేంద్రం, రాష్ట్రాల మద్య ఏర్పడిన వివాదాలపై కాని ఇలా ఎటువంటి వాటిపై కూడా పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.

ADVERTISEMENT

మొదటి నుంచి ప్రత్యేక హోదా సాధించడం కోసం అనేక కార్యక్రమాలు చేసిన ఘనత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిదేనని, ప్రత్యేక హోదాపై జగన్‌కు క్రెడిట్‌ దక్కకూడదనే పవన్‌తో కలిసి బాబు నాటకాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. అసలు కేంద్రం ఏదో ప్రత్యేక హోదా ఇస్తా అన్నట్టు ఈ క్రెడిట్ కోసం కొట్లాట ఏంటో?

ADVERTISEMENT
Latest Stories