వైద్య వృత్తి రోజురోజుకు ఎంత దిగజారుతుందో అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇది. వైద్యుడు లేని వేళ సెక్యూరిటీ గార్డు ఒక పేషెంట్ కు వైద్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణాలోని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి నందు జరిగిన ఈ ఘటన, వీక్షకులకు షాక్ ఇస్తోంది. డాక్టర్ అన్ని వేళలా అందుబాటులో ఉండరు గనుక డ్యూటీ డాక్టర్లను నిర్ణీత సమయాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంచుతారు.
అయితే ఈ సెక్యూరిటీ గార్డునే ‘టూ ఇన్ వన్’ రూపంలో అప్పాయింట్ చేసుకున్నారో లేక డ్యూటీ డాక్టర్ రాలేదో గానీ తలకు దెబ్బ తగిలిన ఓ మహిళకు సెక్యూరిటీ గార్డు చికిత్స చేయడాన్ని అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో ఇది కాస్త సందడి చేస్తూ మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది. దీనిపైన రియాక్షన్ ఎలా ఉంటుందో గానీ… డాక్టర్ వృత్తి ఎంత తేలిక అయిపోయిందో ప్రజలకు చాటి చెప్తున్నారు.
అయితే ఈ వీడియోను పరిశీలిస్తే… డ్యూటీ డాక్టర్ లేరు గనుక ఆపద సమయంలో చేస్తున్న వైద్యంలా కనిపించడం లేదు. అందులో ప్రావీణ్యత పొందిన వ్యక్తిగా సదరు సెక్యూరిటీ గార్డు ప్రవర్తించడం షాకింగ్ కు గురిచేస్తోంది. అంటే సిరిసిల్ల ఆసుపత్రిలో వైద్యం సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణలో జరగడం కాదు, ఏకంగా సెక్యూరిటీ గార్దులే చేస్తున్నారన్న విషయం అర్ధమవుతోంది. మరి దీనిపై చర్యలు ఏమైనా ఉంటాయో లేక ఏ కాకమ్మ కధనో చెప్పి తప్పించుకుంటారో చూడాలి.
Shocking incident happened at Siricilla Govt Hospital,security guard suturing patient's head injury as duty doctor absent#Telangana @KTRTRS pic.twitter.com/wNGsSLj4p0
— kavitha Rao (@iamKavithaRao) November 2, 2016



