ktr-in-acb-office

ఎఫ్-1 రేసింగ్ కేసుని కేటీఆర్‌ ఓ పనికిమాలిన లొట్టిపీసు కేసు అని ఎద్దేవా చేసి, ఆ కేసుని కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేస్తే ఆయన పిటిషన్నే హైకోర్టు కొట్టి వేసింది. సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్‌ వేస్తే ‘లొట్టిపీసు కేసే కదా’ అని అనుకుందో ఏమో అంత అర్జంటుగా విచారించాల్సిన అవసరం లేదంటూ జనవరి 15కి వాయిదా వేసింది.

లొట్టిపీసు కేసే కదా.. ఏసీబీ విచారణకు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారని ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్‌లో ఏసీబీ కార్యాలయం వద్ద బిఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పడిగాపులు కాస్తున్నా ఇంత వరకు కేటీఆర్‌ బయటకు రాలేదు. వస్తారో లేదో కూడా తెలీదు. నాలుగు గంటలుగా విచారణ కొనసాగుతుండటంతో ‘ఇది నిజంగానే లొట్టిపీసు కేసేనా…కాదా?” అని వారికీ అనుమానం కలిగే ఉంటుంది.

Also Read – సంక్రాంతికి వస్తున్నాం అన్నారు.. మరిచిపోకండి సార్లూ

ముఖ్యంగా ఇదో లొట్టిపీసు కేసు..మరో వెయ్యి కేసులనైనా ధైర్యంగా ఎదుర్కుంటా… ఎవరికీ తల వంచనని ప్రగల్భాలు పలికినప్పుడు మళ్ళీ తోడుగా న్యాయవాది లేకపోతే విచారణకు వెళ్లలేనని హైకోర్టుని ఆశ్రయించడం ఎందుకు?అనే సందేహం కలుగుతుంది.

కేటీఆర్‌ వెంట న్యాయవాదిని తీసుకువెళ్ళేందుకు హైకోర్టు అనుమతించింది. కానీ ఆయన చెయ్యి పట్టుకొని పక్కనే కూర్చోనీయలేదు. పక్క గదిలో న్యాయవాది కూర్చొని చూస్తుండమని చెప్పింది.

Also Read – ఈ ఏడాది ఏపీకి అంతా శుభం… పండుగ చేసుకోవలసిందే!

తొలిసారిగా స్కూలుకి వెళ్ళే బాలుడు తల్లి తండ్రులు తోడుగా రారని తెలిసి భయంతో ఏడుస్తాడు. అలాగే ఉంది ఇప్పుడు కేటీఆర్‌ పరిస్థితి కూడా.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మహిళనైన తనని ఈడీ అధికారులు ఒంటరిగా విచారించడం చట్ట విరుద్దమని కల్వకుంట్ల కవిత ఎంత తెలివిగా వాదించినా ఒంటరిగానే విచారణకు హాజరుకాక తప్పలేదు. ఢిల్లీలో చెల్లి ఒంటరిగా విచారణని ఎదుర్కొన్నప్పుడు, హైదరాబాద్‌లోనే అన్న మరెంత ధైర్యంగా ఉండాలి?అని ఎవరూ ఆలోచించిన్నట్లు లేదు.

Also Read – మీడియా వారు జర భద్రం…!

హైకోర్టు, సుప్రీంకోర్టు పిటీషన్లు కొట్టేసిన తర్వాత ఏసీబీ విచారణకు బయలుదేరే ముందు ఎప్పటిలాగే పిడికిలి బిగించి ‘పోరాడుదాం’ అని సైగలు చేస్తూ వెళుతుంటే, బిఆర్ఎస్ సోషల్ మీడియాలో ఆయనేదో ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరుతున్న అలగ్జాండర్ అన్నట్లు, ఆయనపై పాటలు, వీడియోలు తయారుచేసి పోస్ట్ చేసుకుంటున్నాయి.

కానీ గిట్టనివారు మాత్రం గతంలో కల్వకుంట్ల కవిత కూడా ఇలాగే పిడికిలి బిగించి, తెరిచి చూపిస్తూ తాను 5 నెలలు తిహార్ జైల్లో ఉండబోతున్నానని పదేపదే చెప్పినా ఎవరూ అర్దం చేసుకోలేదని, ఇప్పుడు కేటీఆర్‌ కూడా అదే సైగలు చేస్తున్నా ఎవరికీ అర్దం కావడం లేడని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

ఏది ఏమైనప్పటికీ ఇదో లొట్టిపీసు కేసని కేటీఆర్‌ చెప్పారు. కనుక ఈ కేసులో తనని అరెస్ట్‌ చేస్తే జైల్లో ఏం చేయాలో ముందే ప్లాన్ చేసుకున్నారు. ఆయన కడిగిన ముత్యంల బయటకు వస్తారని బావ హరీష్ రావు చెపుతున్నారు.

ఏదో ఓ కేసులో ఒకసారి అరెస్ట్‌ అయ్యి జైలుకి వెళితే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారనే సెంటిమెంట్ కూడా బలంగా ఉంది. బెయిల్‌పై బయటకు వచ్చేస్తే ఎలాగూ న్యాయం ధర్మం గెలిచేసిన్నట్లే. కనుక ఈ లొట్టిపీసు కేసు గురించి, కేటీఆర్‌ గురించి ఎవరూ వర్రీ అయిపోనవసరం లేదు.