ఆ రెండు పార్టీలు గోదావరికి బిందెలు అడ్డం పెట్టొచ్చుగా?

Somireddy Chandra Mohan Reddy

ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది. రోజుకి 50,60 టీఎంసీలు నీళ్ళు సముద్రంలో కలిసిపోతున్నాయి. దీనిపై టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలకు చురకలు వేశారు.

“ఇక్కడ రోజుకి 50,60 టీఎంసీలు నీళ్ళు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఎగువ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్‌ నాయకులు బిందెలు అడ్డం పెట్టొచ్చు కదా? కనీసం కాంగ్రెసొళ్ళు చెంబులతో నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు కదా?ఎవరో ఒకరు బిందెలో చెంబులో అడ్డం పెట్టి ఈ గోదావరి వరదని ఆపండయ్యా,” అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్టుపై రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలకు చురకలు వేశారు.

ADVERTISEMENT

తెలంగాణలో తమ కళ్ళెదుగా ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నీటిని వాడుకోలేకపోతున్న కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు ఇంకా కాగితాల మీదున్న బనకచర్ల ప్రాజెక్టు వలన తెలంగాణకు నష్టం జరిగిపోతుందని, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ నీళ్ళను దోచుకుపోతున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బనకచర్ల ప్రాజెక్టుని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వాటి ఒత్తిళ్ళ వలననే ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తిప్పి పంపింది.

కనుక సముద్రంలో కలిసిపోతున్న గోదావరి నీటిని తోడిపోసుకోమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాటికి చురకలు వేశారు.

ADVERTISEMENT
Latest Stories