దశాబ్దాలపాటు సౌత్ సినిమా అంటే నార్త్ వాళ్ళకి ఎందుకో చులకన. తమిళ చిత్రసీమకైనా కాస్త రెస్పెక్ట్ ఇచ్చారు కానీ.. తెలుగు అంటే మాత్రం చాలా చిన్న చూపు. ఇక మలయాళ ఇండస్ట్రీని బీగ్రేడ్ ఇండస్ట్రీగా చూసేవాళ్ళు, కన్నడను కనీసం గుర్తించేవారు కాదు.
అలాంటిది “బాహుబలి” తర్వాత లెక్కలు మారాయి. తెలుగు చిత్రసీమను ప్రపంచమే గుర్తించింది. దాంతో నార్త్ ఆడియన్స్ అండ్ మీడియా కూడా సచ్చినట్లు గౌరవించడం మొదలెట్టారు. మలయాళం ఇండస్ట్రీలో వచ్చిన మార్పుతో నేషనల్ లెవెల్ లో టాప్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా నిలిపింది. ఇక కేజీఎఫ్ తో కన్నడ ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది. సరిగ్గా అదే సమయంలో బాలీవుడ్ ఒక్కసారిగా డౌన్ అవ్వడంతో.. చేసేదేం లేక సౌత్ సినిమాల్ని పొగుడుతూ పబ్బం గడుపుకున్నారు.
అయితే.. రీసెంట్ గా రిలీజైన “పెద్ది” సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ కానీ, ఆమె గ్లామర్ డోస్ కానీ ట్రెండింగ్ టాపిక్ అవ్వడంతో.. సౌత్ లో హీరోయిన్స్ కి వెల్యూ ఉండదు, ఏదో అంగట్లో బొమ్మల్లా చూస్తారు అని అభిప్రాయాలు వ్యక్తం చేయడం మొదలెట్టారు. ఇదే సందు అనుకుని కొందరు నార్త్ సీనియర్ జర్నలిస్టులు మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్.. గతంలో కొందరు బాలీవుడ్ హీరోయిన్స్ సౌత్ లో జరిగిన క్యాస్టింగ్ కౌచ్ ఇన్సిడెంట్ వీడియోస్ మరియు పూజా హెగ్డే, తాప్సీ వంటి హీరోయిన్లు సౌత్ ఇండస్ట్రీలో నావెల్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్స్ ని తెగ సర్క్యులేట్ చేస్తున్నారు.
“పెద్ది”లో జాన్వీ కపూర్ జూమ్ ఇన్ షాట్స్ కచ్చితంగా తప్పే అలాగని ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మంచి, చెడు అనేది ప్రతి ఇండస్ట్రీలో సర్వసాధారణం. ఇప్పటికిప్పుడు యూట్యూబ్ లో బాలీవుడ్ నటీమణులు తాము టాలీవుడ్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడిన వీడియోల్ని కట్ చేసి సర్క్యులేట్ చేయడం పెద్ద విషయం కాదు. ఇక్కడ తప్పు తెలుసుకొని, దాన్ని రిపీట్ చేయకుండా ముందుకు వెళ్లడం ముఖ్యం కానీ.. బ్లేమ్ గేమ్ కాదు. ఈ సౌత్ మీద హెట్రెడ్ క్యాంపైన్ వెనుక ఉన్నవాళ్లు.. ఈ పోస్టుల కారణంగా తెలుగు ఇండస్ట్రీకి పోయేది ఏమీ లేదని గ్రహించాలి.
2027 లో మోస్ట్ ఎవైటెడ్ సినిమాలు తెలుగు చిత్రసీమ నుంచి ఎక్కువ ఉన్నాయి. మహేష్ వారణాసి, ప్రభాస్ స్పిరిట్, బన్నీ రాకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోలెడు. ఈ సినిమాల రిలీజ్ కి అదే నార్త్ మేధావులు నోరెళ్లబెట్టడం ఖాయం.




