జోహార్ ఎన్టీఆర్… నామస్మరణ… మారుమ్రోగుతోంది..!

johar NTRఆ రాజసం ఎవరికి ఉంటుంది… ఆ ఆహార్యం ఎవరికి ఉంటుంది… ఆ హుందాతనం… నిండుతనం… ఎవరికి ఉంటాయి..! ఇలా చెప్పుకుంటే దానికి సరైన జవాబు… “ఇంకెవరికీ… ఆరడుగుల ఆజానుబాహుడు ఒక్క నందమూరి తారక రామారావుకు తప్ప” అని కీర్తించడం తెలుగు సినీ ప్రేక్షకుల, సాధారణ ప్రజల వంతు..! అవును… ఆ ‘కళాఖండం’ ధరిత్రిపై పడి 94 ఏళ్ళు గడిచాయి. అయినా ఇప్పటికీ అతన్ని మించిన రూపం వెండితెరకు రాలేకపోయింది… అతని ఆలోచనలను మించిన పరిజ్ఞానం గల నాయకుడు రాలేకపోయాడు.

ADVERTISEMENT

అందుకే నేటికి తెలుగు ప్రజలకు ‘బ్రాండ్ అంబాసిడర్’ ఎవరూ అంటే ‘ఎన్టీఆర్’ అన్న మూడక్షరాల పేరు మాత్రమే గుర్తుకు వస్తుంది. సాధారణంగా ఒక మనిషి ఎంత ప్రభావంతుడైనా గానీ, ఒక జనరేషన్ ప్రజల మీదే అతని ప్రభావం ఉంటుంది. కానీ, రెండు జనరేషన్లు మారి, మూడో జనరేషన్ లోకి అడుగుపెడుతున్నా తెలుగు ప్రజానీకంపై ‘ఎన్టీఆర్’ అన్న పేరు ముద్రే ఎక్కువగా కనపడుతోంది. ఆ ప్రభావం ప్రస్తుత సోషల్ మీడియాలో ఇంకా బాగా కనపడుతోంది.

ప్రస్తుతం యువతరంలో ఉన్న వాళ్ళంతా ఎన్టీఆర్ ను ఫోటోలలో, సినిమాలలో తప్ప ప్రత్యక్షంగా చూసి ఉండే అవకాశం లేదు. కానీ, గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ‘జోహార్ ఎన్టీఆర్’ అన్న పేరు మారుమ్రోగిపోతోంది. సాధారణంగా నవతరం యువత మాత్రమే ఎక్కువగా సంచరించే సోషల్ మీడియాలో రెండు తరాల ముందు వ్యక్తి గురించే మాట్లాడుకుంటున్నారంటే… ఎన్టీఆర్ ప్రభావం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వివిధ ఫోటోలు సందడి చేస్తున్నాయి.

అయితే ‘శ్రీమంతుడు’ నిర్మాతలు మైత్రీ మూవీస్ సంస్థ చేసిన పోస్టర్ అభిమానులను, వీక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. “వెండితెర మీ వల్ల వెయ్యింతలు పెరిగింది… తెలుగు జాతి మీ వల్ల తలెత్తుకు తిరిగింది… ఒక్కడే సూర్యుడు… ఒక్కడే చంద్రుడు… ఒక్కడే తారక రాముడని… ధరిత్రి మీ చరిత్రకు నీరాజనాలర్పిస్తోంది…” అంటూ పోస్ట్ చేసిన ఫోటోకు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. అలాగే ‘సింహం’పై ఎన్టీఆర్ కూర్చున్న మరో ఫోటో కూడా నేట్టింట్లో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తోంది. ఫోటోలు వేరైనా ప్రేక్షకులు, అభిమానులు పలుకుతున్న ‘స్వరం’ ఒక్కటే… అదే… జోహార్ ఎన్టీఆర్… అని..!

ADVERTISEMENT
Latest Stories