అందాల తార శ్రీదేవి అకాల మరణం అందరినీ కలిచి వేసిన విషయం తెలిసిందే. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకుని, నేషనల్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, లోకల్ హీరోలు చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి సెలబ్రిటీలు తమ తమ భావాలను సోషల్, ఎలక్ట్రానిక్ మీడియా వేదికలుగా పంచుకున్నారు. అయితే వీటన్నింటిలో కల్లా మిస్ అవ్వకూడని నివాళి ఎవరిదైనా ఉందంటే… అది సుదర్శన్ పట్నాయక్ దే!
సాండ్ ఆర్ట్ స్పెషలిస్ట్ అయిన సుదర్శన్, అస్సాంలోని పూరీ బీచ్ లో ఇసుకతో ‘అతిలోకసుందరి’ శ్రీదేవి బొమ్మ గీసి, ‘వుయ్ విల్ మిస్ యు… రిప్ శ్రీదేవి…’ అంటూ అద్భుతంగా చెక్కారు. సుదర్శన్ మరియు అతని స్టూడెంట్స్ వేసిన ఈ సాండ్ ఆర్ట్ నివాళి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎవరికీ తోచిన విధంగా వారు తమ నివాళి అర్పిస్తున్నారు గానీ… ఇలాంటి కళాఖండాలతో అర్పించే నివాళిని మిస్ అవ్వకూడదు కదా! కళలలో ఉన్న గొప్పతనం అదే… కళాకారులకు లభించే ఆదరణ అదే..! దానికి పర్యాయపదమే శ్రీదేవి..!



