అతిలోక సుందరి శ్రీదేవి ఇకలేరు. ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబసభ్యులతో దుబాయ్‌కు వెళ్లిన ఆమె తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ఈ సంఘటనపై తారలు నుండి సామాన్యుల వరకు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అంతా బాధ పడటం శ్రీదేవి అధిరోహించిన ఎత్తులను సూచిస్తుంది.
అయితే శ్రీదేవి మరణంపై మనం బాధపడాలా? తిరిగి రాని లోకాలకు వెళ్ళిందని రోధించారు? జీవితమంటే శ్రీదేవిలా ఉండాలి అనేలా ఆమె జీవించింది అలానే కనుమూసింది. తొందరగా కెరీర్ మొదలెట్టి, తొందరగా జీవితాన్ని ఆస్వాధించి, తొందరగా అన్ని భాద్యతలు తీర్చేసి, తొందరగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది.
ఆమె ఆమె వెళ్ళిపోయినందుకు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆమె ఎన్ని చేయాలో అన్నీ చేసింది. అశేష అభిమానుల మదిలో తన చివరి రూపం అతిలోకసుందరిగానే ఉండేలా జాగ్రత్త పడింది. ఎటుంచి తన కూతుర్ల ఎదుగుదలను చూడలేకపోయింది. అయితే ఒకరకంగా అదీ మంచిది తన స్థాయిని మించి వారు ఉండాలని తల్లిగా ఆమె కోరుకోవడం సహజం కానీ అది సాధ్యం కాదుగా. శ్రీదేవి ఒక్కరే. ఆ విధంగా తన అంగుళీకం దొరికిన ఇంద్రజ స్వర్గం చేరుకుంది.



