ఏపీలో కళ్ళకు కనపడుతున్న అభివృద్ధికి ఇదో చిన్న సాక్ష్యం!

Andhra Pradesh development

ఒకప్పుడు కాగితాల మీదే అభివృద్ధి జరుగుతుండేది. రాష్ట్ర విభజన జరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కళ్ళకు కనిపించే విదంగా అభివృద్ధి పనులు జరిగాయి.

తర్వాత 5 ఏళ్ళపాటు అభివృద్ధికి బ్రేకులు పడ్డాయి. కానీ అభివృద్ధి అంటే సంక్షేమ పధకాలతో ప్రజలకు డబ్బు పంచడమే అని జగన్‌ గట్టిగా చెపుతుండేవారు. కనుక 5 ఏళ్ళు రాష్ట్రంలో అవే చప్పుళ్ళు వినిపించేవి.

ADVERTISEMENT

ఐదేళ్ళు కనబడకుండా పోయిన అభివృద్ధి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ కనిపించడం మొదలైంది. ఇప్పుడు ఆ వివరాలన్నీ చెప్పుకోవాలంటే నాలుగు కాలమ్స్ కాదు… నాలుగు పేజీలు వ్రాసినా సరిపోదు. అయినా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కళ్ళకు కనిపిస్తుస్తున్నప్పుడు ఆ జాబితా చూడటం అంటే ముంజేతి కంకణాన్ని చూసుకునేందుకు అద్దం కావాలన్నట్లే ఉంటుంది.

కానీ కొన్ని అభివృద్ధి పనులు జిల్లా ప్రజలకు, స్థానికులకు తెలిసినంతగా రాష్ట్ర ప్రజల దృష్టికి రావు. అటువంటిదే శ్రీకాళహస్తి-ప్రకాశం జిల్లాలోని నడికుడి మద్య రైల్వే లైన్ నిర్మాణ పనులు.

దీని కోసం దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. కానీ భూసేకరణ సమస్యలతో పాటు అనేక రాజకీయ కారణాలు, సమస్యల వలన ఈ పనులు పూర్తవడం లేదు.

ఎప్పటిలాగే దీనికీ ‘సర్వరోగ నివారిణి’లా చంద్రబాబు నాయుడే!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఈ రైల్వే లైను నిర్మాణంలో గ్రామాల స్థాయి నుంచి దిల్లీలో రైల్వేశాఖ వరకు అవరోధంగా ఉన్న సమస్యలన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరించారు.

దీంతో ఈ ఒక్క ఏడాదిలోనే కనిగిరి-పామూరు మండలాల మద్య సుమారు 50 కిమీ మేర రైల్వే లైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అంతే కాదు… రైల్వే అధికారులు నడికుడి నుంచి కనిగిరి వరకు రైల్ ఇంజనుతో ట్రయల్ రన్ కూడా నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే మిగిలిన పనులు కూడా పూర్తి చేసి శ్రీకాళహస్తి-ప్రకాశం మద్య రైళ్ళు నడిపిస్తామని చెప్పారు.

శనివారం మంగళగిరిలో జాతీయ రహదారుల శంకుస్థాపన కార్యక్రమం జరిగినప్పుడు, ముఖ్య అతిధిగా వచ్చిన కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రా ప్రజలు సంతోష పడే కొన్ని విషయాలు చెప్పారు.

రాష్ట్రంలో ఇప్పటికే సుమారు రూ.2.5 లక్షల కోట్లతో జాతీయ రహదారులు, అంతర్గత రహదారుల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయని చెప్పారు. ఈ ఆర్ధిక సంవత్సరం చివరినాటికి అంటే 2026, మార్చి 31 నాటికి మరో లక్ష కోట్ల విలువగల రోడ్ల నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టబోతున్నామని చెప్పారు.

రాబోయే రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు అమెరికాలో రోడ్లని తలపిస్తాయని నితిన్ గడ్కరీ చెప్పారు. విజయవాడ-హైదరాబాద్‌ మద్య జాతీయ రహదారిని ఆరు లేన్లకు విస్తరిస్తున్నామని చెప్పారు. ఆ పనులు పూర్తయితే విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కేవలం రెండు-రెండున్నర గంటలలో చేరుకోవచ్చని నితిన్ గడ్కరీ చెప్పారు.

రాబోయే నాలుగైదేళ్ళలో ఈ రోడ్ల నిర్మాణాలన్నీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రమే మారిపోతుందని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దేశంలో ఒకటి లేదా రెండో స్థానంలో నిలవడం ఖాయమని నితిన్ గడ్కరీ అన్నారు. ఇదే కదా ప్రజలు కోరుకుంటున్నది. ఇంత చిన్న విషయం మరి జగన్‌కి ఎందుకు అర్ధం కాలేదో!

ADVERTISEMENT
Latest Stories