‘HMPV’ వైరస్ స్టాక్ మార్కెట్ తో ఆగుతుందా.?

stock-market-in-losses-due-to-hmpv-virus

ప్రపంచం ముందుకు మరో వైరస్…కరోనాను మించి ప్రభావము చూపిస్తుందా.? లేక టీ కప్పులో తుఫాన్ మాదిరి ముగిసిపోతుందా.? అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గతంలో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే పరిస్థితి ఉండేది..,కానీ ఇప్పుడు కరోనాకు ముందు కరోనాకు తరువాత అనే నానుడి నడుస్తుంది.

అయితే గత కొద్దీ రోజులుగా చైనా దేశాన్ని, అక్కడి ప్రజలను భయపెడుతున్న ఈ HMPV వైరస్ ఇప్పుడు భారత్ లోకి అడుగుపెట్టింది. భారతదేశంలోని బెంగుళూర్ ప్రాంతంలోని ఒకరికి 3 నెలలు, మరొకరికి 8 నెలల వయస్సు ఉన్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్టు సమాచారం. అయితే ఈ కుటుంబానికి సంబంధించి ఎవరికీ అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హిస్టరీ లేదు.

ADVERTISEMENT

అయినా కూడా వారికి ఆ వైరస్ ఎలా సోకింది అనేదాని మీది విచారణ చేస్తున్నారు అధికారులు. అలాగే వ్యాధి నియంత్రణకు ఆ చిన్నారులకు తక్షణ వైద్య సహాయం అందిస్తున్నారు వైద్యులు. అయితే వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అందుకు తగ్గట్టుగానే మాస్క్ లను ధరించి శానిటైజేర్లను ఉపయోగించాలంటూ తగిన జాగ్రత్తలు పాటించాలంటూ వైద్యులు సూచనలు జారీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో భాగంగా మరోసారి HAMPV తన పవర్ తో ప్రపంచాన్ని లాక్ చేస్తుందా.? అనే చర్చలు మొదలుపెట్టారు. గతంలో వచ్చిన కరోనా మహమ్మారికి గాను ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా దెబ్బతిన్నారు. వాటినుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే ముందుకువెళుతున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ HMPV వైరస్ మరోసారి ప్రపంచాన్ని స్థంబింప చేయనుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఇక కొరోనా దెబ్బకు ఎన్నో పరిశ్రమలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయి. వాటిలో హోటల్ రంగం మొదలుకుని సినీ రంగం వరకు అన్ని వాటి వాటి స్థాయికి తగ్గట్టు నష్టాలను మోసాయి. ప్రజలు ఎక్కువగా గుమిగూడి ఇటువంటి ప్రాంతాలల్తో వైరస్ వైపతి అధికంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వాలు విధించే ఆంక్షలకు ఈ రంగాలు కుదేలయ్యాయి. ఇప్పుడు కూడా ఆ పరిస్థితులు తిరిగి వస్తాయా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇక భారతీయ దేశీయ మార్కెట్, స్టాక్ ఎక్సచేంజ్ కూడా కరోనా మహమ్మారి సమయంలో ఎన్నడూ లేని విధంగా భారీ నష్టాలను చవి చూసింది. నేడు భారత్ లో నమోదైన ఈ HMPV వైరస్ కేసుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా భారీ నష్టాల బాట పట్టాయి. దేశీయ మార్కెట్ నేల చూపులు చూడడంతో అన్ని రంగాలకు సంబంధించిన సూచీలు ఎరుపు రంగు పూసుకున్నాయి. దీనితో ఈ వైరస్ మరో ప్రళయానికి సూచికగా చెప్పవచ్చా అంటున్నారు ట్రేడర్స్.

మార్కెట్ మొదటి సెషన్ లోనే అనూహ్యంగా దాదాపు 5 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్లు ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక మున్ముందు ఈ వైరస్ ఇంకెన్ని దారుణాలకు నాందిగా మారనుందో.? ఇంకెన్నిటిని తన ఖాతాలో బలి చేసుకుంటుందో అనే భయం మరోసారి ప్రపంచం ముంగిట నిలవనుంది.

ADVERTISEMENT
Latest Stories