‘గూగుల్’ సీఈఓకే దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు!

Sundar Pichai, Sundar Pichai Hacker, Sundar Pichai Quora Hacker, Sundar Pichai Hacker shock, Sundar Pichai Hacker News, Sundar Pichai Google Hacker నేటి వెబ్ ప్రపంచంలో హ్యాకర్లు సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఒకప్పుడు ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి సంచలనం సృష్టించిన హ్యాకర్లు తాజాగా ‘గూగుల్’ సీఈఓ సుందర్ పిచాయ్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి మరోసారి హ్యాకింగ్ సత్తా చాటారు. ‘అవర్ మైన్’ అనే హ్యాకింగ్ గ్రూప్ తామే ఈ హ్యాకింగ్ కు పాల్పడినట్లుగా ప్రకటించుకుంది.

‘అవర్ మైన్’ తన వెబ్ సైట్ లో సుందర్ పిచాయ్ ఖాతా హ్యాకింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేయడంతో హ్యాకింగ్ నిర్ధారణ అయ్యింది. సాక్షాత్తు గూగుల్ సీఈఓ అకౌంట్ హ్యాకింగ్ గురవ్వడంతో ఇంటర్నెట్ ప్రపంచంలో సెక్యూరిటీ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో హ్యాకర్లు వారు, వీరన్న తారతమ్యం లేకుండా మరింతగా రెచ్చిపోతుండడం ఇంటర్నెట్ వినియోగదారులను కలవరిచే అంశం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories