
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న విజయవాడ, పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు ఒకరొకరుగా అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారు. కనుక ఏదో రోజు సునీతని కూడా లేపేస్తారేమో?
ఈ కేసులో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ తీసుకొని స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. సాక్షులు, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తూ ఈ కేసుని పక్కదారి పట్టిస్తున్నారు. సీబీఐ విచారణాధికారి మీదే కేసు వేయించడమే ఇందుకు నిదర్శనం కాదా?
Also Read – దానం: గోడ మీద పిల్లి మాదిరా.?
కనుక ఈ కేసుని ప్రభావితం చేస్తున్న అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేసి జైల్లో ఉంచాలి. లేకుంటే సునీత ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంది,” అని వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
“రోడ్ ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మరణించారని పోలీసులు వీడియో సాక్ష్యాలు చూపిస్తున్నారు. ఆయన భార్య, తమ్ముడు కూడా రోడ్ ప్రమాదమే అని నమ్ముతున్నారు. రాజకీయాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కానీ ఆయన మృతిపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తూ ప్రజల మద్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తోంది,” అని వైఎస్ షర్మిల అన్నారు.
Also Read – వైసీపీ నేతల రిమాండ్ కష్టాలు…
వివేకానంద రెడ్డి దారుణంగా హత్య చేయబడితే గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేసిన వైసీపీ నేతలే రోడ్ ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మరణిస్తే హత్య అని నమ్మించే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.
వివేకా హత్యని చంద్రబాబు నాయుడు నిందిస్తున్నట్లే, ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల మరణాన్ని కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఆపాదించాలని వైసీపీ ప్రయత్నిస్తుండటం గమనార్హం.
Also Read – భారత్ పాలిట కరోనాలా పాక్.. టీకాలు తప్పవు
వివేకా కేసులో సాక్షులే ఒకరొకరుగా చనిపోతున్నప్పుడు ఈ కేసులో అవినాష్ రెడ్డితో సహా నిందితులను శిక్షించాలని న్యాయపోరాటాలు చేస్తున్న సునీత ప్రాణాలకు భద్రత ఉంటుందా?అనే వైఎస్ షర్మిల ప్రశ్న ఆలోచింపజేస్తుంది.
ఇటువంటి ప్రమాదం పొంచి ఉందని తెలిసినా వ్యవస్థలు నిర్లిప్తంగా వ్యవహరిస్తుంటే, ఒకవేళ నిజంగా రేపు అదే జరిగితే అప్పుడు ఎవరు బాధ్యతవహిస్తారు? వైఎస్ షర్మిల అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు?