
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ఇంకా వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండగా, అభిమానులందరూ ఐపీఎల్ పండగ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. భారత ఆటగాళ్లే వివిధ ఫ్రాంచైజీలకు ఆడి పైసా-వసూల్ మ్యాచ్లను అందించే ఐపీఎల్ సన్నాహం కోసం భారతీయులే కాదు ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ఐపీఎల్ 2021 ,22 ,23 లో భారీగా చతికిలబడ్డారు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. 2013 లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన హైదరాబాద్ జట్టు, నిలకడైన ఆటతీరును కనబరుస్తూనే వచ్చారు. ఇప్పటివరకు సుమారు 7 సార్లు నాక్-ఔట్స్ ను చేరుకున్న SRH కేవలం 2016 మాత్రమే ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
Also Read – ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే ఇళ్ళు కట్టుకు నివసిస్తున్నా…
ఇదంతా 2020 వరుకు జరిగిన కథ, ఆ తరువాత జరిగిన మూడు సీజన్లలోనూ ఆ జట్టు నాక్-ఔట్స్ కాదు కదా, ఏకంగా టేబుల్ లాస్ట్ లో నిలిచారు. అదే సమయంలో వార్నర్, విలియంసన్, ధావన్ వంటి బడా ఆటగాళ్లను జట్టు నుండి విడుదల చేశారు హైదరాబాద్ యాజమాన్యం.
ఇక, 2024 సీజన్ ప్రారంభానికి ముందు, తమ జట్టు సమకూలత పై దృష్టి సారించిన యాజమాన్యం, విధ్వంసాన్ని సృష్టించే బ్యాటర్లను జట్టులోకి తీసుకున్నారు. హెడ్, అభిషేక్, నితీష్, క్లాసేన్ ను జట్టులో ఉంచి, కమిన్స్ ను సారధిగా నియమించారు. యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం, తమను ఏకంగా 2024 సీజోన్లో ఫైనల్ కు పట్టుకెళ్లింది.
Also Read – ప్రమోషన్స్ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!
అయితే, ఇప్పుడు వీరందరికి తోడుగా జార్ఖండ్ యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకున్నారు హైదరాబాద్ యాజమాన్యం. వేటగాళ్ల మధ్యలో మరో వేటగాడిని పడేశారంటూ హైదరాబాద్ అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా, జట్టు తో మమేకమయ్యారు ఇషాన్ కిషన్. చూడాలి మరి గత ఏడాది చేతిదాకా వచ్చి నోటికందకుండా పోయిన ఐపీఎల్ ట్రోఫీ ఈ సారైనా అందుకోగలదా అని..?