Mahesh Babu

సినీ ప్రపంచంలో తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ తన ప్రత్యేకతను చాటుకుని సూపర్ స్టార్ గా ఎదిగారు హీరో ప్రిన్స్ మహేష్ బాబు. సినిమా, కుటుంబం తప్ప మరే ధ్యాసలోను కనిపించని మహేష్ బాబు సేవ కార్యక్రమాలలో మాత్రం ముందుంటారు.

ఇప్పటికే ఆంధ్ర హాస్పిటల్ తో ఒప్పందం కుదుర్చుకుని చిన్న పిల్లల గుండె సమస్యలకు ఉచితంగా ఆపరేషన్ చేపిస్తూ తీసుకోవడంలో కాదు ఆపన్న హస్తం అందించండంలో శ్రీమంతుడని నిరూపించుకున్నారు మహేష్.

Also Read – తెలుగు సినిమాలకు తెలంగాణ తలుపులు మూసుకుపోయిన్నట్లేనా?

సమాజం నుండి చాల తీసుకున్నాం తిరిగిచ్చేయాలి లేకపోతే లావైపోతాం అని తన శ్రీమంతుడు సినిమాలో డైలాగ్ మాదిరే మహేష్ కూడా సమాజం పట్ల తనవంతు బాధ్యతగా ఇప్పటికే ఎన్నో వందలమంది పిల్లలకు ఉచితంగా వైద్యం అందించి వారి కుటుంబాల గుండెలలో ఒక దేవునిగా మారిపోయారు మహేష్.

తాజాగా మహేష్ చేసిన మరో సేవ కార్యాక్రమం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. కృష్ణ జిల్లా పెద్దప్రోలుకు చెందిన రాజేష్ కృష్ణ గారికి వీరాభిమానిగా ఉంటూ మహేష్ కు అభిమానిగా మారారు. మహేష్ మీద తనకున్న అభిమానంతో ఆయన ముగ్గురి పిల్లలకు అర్జున్, అతిథి, ఆగడు అంటూ మహేష్ సినిమాల పేర్లు పెట్టారు.

Also Read – జగన్‌ 2.0: ఏపీకి, చంద్రబాబుకి మరింత కష్టమే!

అయితే ప్రస్తుతం రాజేష్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మంచానపడ్డారు. దీనితో ఆయన కుటుంబ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కావడంతో ఈ విషయం తెలుకున్న మహేష్ రాజేష్ పిల్లల చదువుకయ్యే ఖర్చు పూర్తి బాధ్యతను తానూ తీసుకుంటానని హామీ ఇచ్చారట.

ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన సోషల్ మీడియాలో స్టోరీగా పోస్ట్ చేసారు. దీనితో మహేష్ రీల్ హీరోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే అంటూ, మా బాబు మనసున్న శ్రీమంతుడు అంటూ పోస్టులు పెడుతున్నారు మహేష్ అభిమానులు.

Also Read – అన్న వచ్చాడు…చెల్లి రాలేదే.?