నోటుకు ఓటు కేసు తుస్సుమంటుందా లేక పామై కాటేస్తుందా?

Uday Simha - Jerusalem Mathaiahతెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు సుప్రీం కోర్టులో గురువారం విచారణకు వచ్చింది. ఈ కేసులో తననను ఇంప్లీడ్‌ చేయాలని ఉదయ సింహ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, కేసు ఆలస్యం కావడానికే ఈ పిటిషన్లని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ తరఫు న్యాయవాది రావల్‌ వాదించారు. ఈ కేసులో ఏపీ, తెలంగాణ పోలీసులు కుమ్మక్కయారని మరో నిందితుడు జెరూసలేం మత్తయ్య కోర్టుకు తెలిపారు. గతంలో రక్షణ కల్పించాలని కోర్టు చెప్పినా ఇంత వరకు పోలీసులు వినలేదని మత్తయ్య పేర్కొన్నారు.

[m9ad]

ADVERTISEMENT

డీజీపీ అపాయింట్‌ మెంట్‌ ఇవ్వట్లేదని, ప్రాణహాని లేదని రిపోర్ట్‌ ఇచ్చారని కోర్టుకు నివేదించారు. తెలంగాణ డీజీపీ ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఉదయసింహా దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌పై మాత్రం ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తదుపరి విచారణ జనవరి 29న చేపడతామని ధర్మాసనం పేర్కొంది. జనవరి 29 అంటే అప్పటికి తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనేదాని పై ఈ కేసు భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

ఒక దశలో సీన్ లేదు అనుకున్న కాంగ్రెస్ మహాకూటమి గా ఏర్పడ్డాక గేమ్ లోకి వచ్చింది. ఇది కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కనుక అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినందుకు గానూ ఈ కేసు దుమ్ము దులిపి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ చంద్రబాబుని ఇబ్బంది పెట్టె ప్రయత్నం తప్పక చేస్తుంది. అదే మహాకూటమి అధికారంలోకి వస్తే ఈ కేసు ముందుకు నడవడం కష్టమే. నోటుకు ఓటు కేసు తుస్సుమంటుందా లేక పామై కాటేస్తుందా అనేది డిసెంబర్ 11న తేలబోతుంది.

ADVERTISEMENT
Latest Stories