ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారని టీడీపీ నేతలు పోరాటాపంతాలో ఉన్నారు. టీడీపీ నాయకులకు ధీటుగా బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే దీనిపై జాతీయ స్థాయి నాయకుల వైఖరి కాస్త భిన్నంగానే ఉంది. విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సుకు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.
ఇద్దరు మంత్రులు నితిన్ గడ్కరి, ధర్మేంద్ర ప్రధాన్ రావాల్సి ఉన్న వారు మొదటి రోజు రాలేదు. వాళ్ళు రాకపోవచ్చని ఒక ఆంగ్ల పత్రిక కధనాన్ని ఇచ్చింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు కొంత అనుకూలంగా ఉండే సురేష్ ప్రభు మాత్రం హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఎపి గొప్ప రాష్ట్రం ప్రధాని, ముఖ్యమంత్రి ఆలోచనలతో ఈ రాష్ట్రం వెలిగిపోతోందన్నారు.
వాహనరంగం, ఆటోకంపోనెంట్ బాగా వృద్ధి చెందేందుకు అవకాశాలున్నాయని.. మరో మూడేళ్లలో ఏపీ పెద్ద ఆటోహబ్‌గా మారుతుందని చెప్పారు. ఇక్కడినుంచి కార్ల ఎగుమతులు మొదలవుతాయని చెప్పారు. ఒకవైపు ఎపిలో అంతా అవినీతి, అక్రమాలేనని ఎపి బిజెపి నేతలు విమర్శిస్తుంటే, మరోవైపు ఇంకో కేంద్రమంత్రి ఇక్కడ ప్రభుత్వాన్ని పొగడటం ఆ పార్టీలో అయోమయాన్ని సూచిస్తుందా?



