హీరోతో గొడవ పెట్టుకున్న ఫ్యాన్స్!

Sushant singh Rajput Fans Selfie Latest News‘ధోనీ – ది అన్ టోల్డ్ స్టోరీ’ హీరో సుశాంత్ సింగ్ కు, అభిమానులకు మధ్య మాటామాటా పెరిగిన క్రమంలో అతని ఇంటి వాచ్ మెన్ పై ఫ్యాన్స్ దాడికి దిగిన సంఘటన ముంబయిలో చోటు చేసుకుంది. మంగళవారం నాడు అర్ధరాత్రి సుశాంత్ తన కొత్త కారు ‘మసెరటి’లో ముంబయిలోని ఓ ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్ళగా, సుశాంత్ ను చూసిన అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. అయితే అందుకు సుశాంత్ ఒప్పుకోలేదు.

ఆ తర్వాత తన కారులో ఇంటికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సుశాంత్ వాహనాన్ని కొంత మంది అభిమానులు వెంబడిస్తూ అతని ఇంటి వరకు వెళ్లారు. దీంతో సుశాంత్ మరియు అతని వాచ్ మెన్ ఆ అభిమానులను అక్కడి నుంచి పంపించేందుకు యత్నించారు. ఈ క్రమంలో సుశాంత్ కు – అభిమానులకు మధ్య మాటా మాటా పెరగడం, అతని వాచ్ మెన్ పై వారు దాడి చేయడం జరిగిందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories